వ‌రంగ‌ల్-న‌ల్గొండ‌-పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి షాక్ త‌గ‌ల‌నున్న‌ట్లు తాజా రాజ‌కీయ ప‌రిణామాలు చెపుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాగైనా కోదండ‌రాంను ఓడించాల‌ని కేసీఆర్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. కోదండ‌రాంను చ‌ట్ట‌స‌భ‌ల్లోకి రాకుండా చేయాల‌ని కేసీఆర్ వేస్తోన్న ఎత్తులు మామూలుగా లేవు. ఇక టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి గెలుపుకోసం మూడు జిల్లాల‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు.

అయితే ఇదే టైంలో ఈ మూడు జిల్లాల‌కు చెందిన పార్టీ కీల‌క నేత‌లే ఓపెన్‌గా కోదండ‌రాంకు స‌పోర్ట్ చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. రెండు రోజుల క్రిత‌మే సూర్యాపేట జిల్లాలో ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు అంద‌రి ముందే నిర‌స‌న గ‌ళం వినిపించాడు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ మాజీ ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట‌రావు అనుచ‌రులు కోదండ‌రాంకు జై కొట్టారు. కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసీ మేరెడ్డి వసంత తాము ప్రొఫేసర్‌ కోదండరాంకు మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌ల‌గంపై కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ మంత్రి వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు టీఆర్ఎస్‌లో చేరాక జ‌ల‌గంను ప‌ట్టించుకోవ‌డం అధిష్టానం మానేసింది.

దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో అటు మున్సిపాల్టీలో... ఇటు జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో జ‌ల‌గం వ‌ర్గీయులు కొంద‌రు ఇండిపెండెంట్లుగా గెలిచారు. త‌ర్వాత వీరు టీఆర్ఎస్‌లో చేరినా ఎమ్మెల్యే వ‌న‌యా ప్ర‌యార్టీ ఇవ్వ‌డం లేద‌ని.. ఇప్పుడు వీరంతా కోదండ‌రాంకు స‌పోర్ట్ చేస్తూ పార్టీ అధిష్టానానికే స‌వాల్ విసురుతున్నారు. వీరు జ‌ల‌గం పార్టీ మీద అసంతృప్తితో త‌న వ‌ర్గాన్ని కోదండ‌రాంకు మ‌ద్ద‌తు ప‌లుకుమ‌ని చెపుతోన్న ప‌రిస్థితి. మ‌రి పార్టీలో ఈ అస‌మ్మ‌తుల‌ను టీఆర్ఎస్ ఎలా స‌రిచేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: