నిరుద్యోగ భృతి ప్రవేశపెట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిరుద్యోగ భృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటే అనేది స్పష్టత లేకపోయినా నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టడానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇప్పుడు నిరుద్యోగభృతి విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

ఇప్పటివరకు కూడా నిరుద్యోగ భృతి కి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం కాకపోయినా సీఎం కేసీఆర్ మనసులో మాత్రం కొన్ని ఆలోచనలు ఉన్నట్టుగా టిఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి. నిరుద్యోగ భృతిని డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఇవ్వాలి అని ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు ఇవ్వవద్దు అనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు అని కొంతమంది అంటున్నారు. అయితే ఇంజనీరింగ్ చదవిన వాళ్ళు తెలంగాణ లో చాలామంది ఉన్నారు. కానీ వాళ్లకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.

డిగ్రీ చదివిన విద్యార్థులు తక్కువగా ఉండటంతో ముందు వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ చదివిన వాళ్లకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన వద్ద  కొంత మంది మంత్రులు తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే డిప్లమో చదివిన విద్యార్థులకు కూడా నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు అని అంటున్నారు. అయితే ముందు డిగ్రీ చదివిన వాళ్లకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉండవచ్చు అనే అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. అయితే దీనికి ఎప్పటి నుంచి శ్రీకారం చుడతారు ఏంటనేది తెలియకపోయినా త్వరలోనే తేదీ ఖరారు చేసే అవకాశాలు ఉండవచ్చు అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: