ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ చాలా వరకు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కొన్ని అంశాల్లో వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కువగా తప్పు చేస్తున్నారనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న తప్పులు కారణంగా కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో కొంత మందికి ముఖ్యమంత్రి జగన్ విపరీతమైన అధికారాలు ఇచ్చేసారు. దీంతో కొంతమంది మంత్రులు చెలరేగిపోతున్నారు అనే ఆవేదన వ్యక్తమవుతోంది. రాయలసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు ముగ్గురు మంత్రులు అయితే కనీసం ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోవడం లేదనే భావన ఉంది.

నియోజకవర్గాల్లో అనవసర రాజకీయాలు మొదలు పెట్టారు. దీనితో వర్గ విభేదాలు కూడా వైసీపీలో పెరిగిపోతున్నాయి. పార్టీ బలంగా ఉన్న సమయంలో ఇలాంటి వర్గ విభేదాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా బలంగా కనబడింది. చంద్రబాబు నాయుడు వ్యూహాలతో పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. అయితే పార్టీలో ఉన్న విభేదాల కారణంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి పాలైంది. పైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకోవడం స్థానికంగా ఎమ్మెల్యే వైసీపీ నుంచి గెలవాలి అనుకోవడం వంటివి జరిగాయి.

దీనితో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలి అనుకుంటూ స్థానికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాలి అని కోరుకునే పరిస్థితి వైసీపీ నేతలు తీసుకొస్తున్నారు. విభేదాల కారణంగా చాలామంది పార్టీ నేతలు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు రావడం లేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా మంత్రుల చాలా నియోజకవర్గాల్లో పెత్తనం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో దృష్టి పెడతారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: