కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏడాది క్రితం వెలుగుచూసిన ఈ మాయదారి వైరస్ తో దేశాలు ఇంకా వణికిపోతూనే ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వైరస్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. దేశంలోనూ మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ గతంలో తగ్గినట్లు కనిపించిన వైరస్.. మళ్లీ విజృంభిస్తోంది. అయితే ఏపీలో కరోనాతో పాటు మరో వైరస్ ఉందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తుంటే, ఏపీని జగరోనా వైరస్ పట్టిపీడిస్తోందని లోకేష్ అన్నారు.  ఆ జగరోనా వైరస్ కు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే వ్యాక్సిన్ వేయాలని పిలుపునిచ్చానని లోకేశ్ వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపిస్తే ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తామని భరోసా ఇచ్చానని వివరించారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు.. బందర్ లో ర్యాలీ నిర్వహించారు లోకేష్. బందర్ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని చెప్పారు. బందరు వైసీపీ నేతలు టీడీపీని విమర్శించడం తప్ప మరెలాంటి అభివృద్ది చేయలేదని ప్రజలు అంటున్నారని వివరించారు.

సీఎం జగన్ తో పాటు  మంత్రులైన ముగ్గురు నానీలపై తీవ్రంగా మండి పడ్డారు లోకేష్. తాడేపల్లి కోడికత్తి రెడ్డి, బందరు తాపీకత్తి నాని అధికారంలోకి వచ్చి 21 నెలలు అయ్యిందని... వారు బందరు లో పీకింది ఏంటి?" అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఒకాయన కోడికత్తి డ్రామా.ఆడితే.. ఈయన తాపీకత్తి డ్రామా వేసారు తప్ప చేసింది జీరో అని విమర్శించారు. అంతేకాకుండా తాపీక‌త్తి నానీ బందరుని భ్ర‌ష్టు ప‌ట్టించాడని లోకేష్ మండిపడ్డారు. అసలు నాని అంటేనే నాకెంత? నీకెంత? అని ఎద్దేవా చేశారు. సీఎం జగన ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పనిని ముగ్గురు నానీలకు అప్పగించారని... వారిలో ఒకరు బూతుల శాఖ మంత్రి.. గుడివాడ గెడ్డం గ్యాంగ్ నాని , రెండు అబద్దాల శాఖ మంత్రి బందరు నాని, మూడు అనారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అంటూ లోకేష్ సెటైర్లు వేశారు. "గుడివాడ నాని సన్న బియ్యం సన్నాసి ఐతే బందరు నాని నోరిప్పితే చాలు అబద్దం అనీ ఇక కనీసం సొంత ఊరిలో ప్రజల ప్రాణాలు కాపాడలేని ఏలూరు ఆళ్ల నాని అంటూ ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: