గత కొన్ని రోజులుగా మావోయిస్ట్ పార్టీ ప్రజల్లోకి వచ్చేందుకు తన ఉనికిని చాటుకునేందుకు తీవ్ర స్థాయిలో కష్టపడుతుంది. ఇటీవల జరిగిన దాడి తర్వాత మావోయిస్ట్ పార్టీ గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మావోయిస్ట్ పార్టీ రెండు పేజీల లేఖను విడుదల చేసింది. ఏవోబీ అధికార ప్రతినిధి కైలాసం పేరుతో ఒక లేఖ, విశాఖ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో మరో లేఖ విడుదల చేసారు. ఏవోబీ అధికార ప్రతినిధి కైలాసం లేఖలోని అంశాలు చూస్తే...

చత్తీస్ ఘడ్ లో ప్రహర్ 3 పేరుతో ఆదివాసీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధమన  వైఖరిని అవలంబిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన దేశ వ్యాప్త బంద్ మావోయిస్టు సెంట్రల్ కమిటీ పిలుపు ఇచ్చిందని వివరించారు. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని వైసిపి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్నాయి అని మండిపడ్డారు. ఆదివాసీ ప్రాంతాల్లో కూంబింగ్ దళాలు ఆదివాసీలపై ఆకృత్యాలు చేస్తున్నాయి అని విమర్శించారు.

ఏవోబీ లోని తోట గుడా, పనసపుట్, గునబెడు, ముదిలిపడ్, తదితర ప్రాంతాలలో పోలీస్ క్యాంపులు పెట్టి ఆదివాసీలను వేధిస్తున్నారు అని మండిపడ్డారు. మావోయిస్టు పార్టీ విశాఖ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ లేఖలో అంశాలు చూస్తే... గిరిజన రాజకీయ నేతలు ఎవరి వైపు ఉన్నారో తేల్చుకోవాలి అని తెలిపారు. ఏజెన్సీ లో జరుగుతున్న మైనింగ్ పై గిరిజన నేతల వైఖరి ఏంటి అని ప్రశ్నించారు. బాక్సైట్, కాల్సైట్ పై గిరిజన నేతల వైఖరిని స్పష్టం చేయాలి అని డిమాండ్ చేసారు. ఆదివాసీలను మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు గా ముద్ర వేసి వేధిస్తున్నారు అని మండిపడ్డారు. బాక్సైట్ పై వైసిపి పార్టీ వైఖరి అధికారంలోకి రాకముందు ఒక విధంగానూ అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక విధంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: