ఏపీలో వైసీపీకి 22 మంది లోక్‌సభ ఎంపీల బలం ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు 25కి 25 మంది ఎంపీలని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక జగన్ పిలుపుతో ప్రజలు వైసీపీని 22 చోట్ల గెలిపించారు. ఇక టీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది.  అయితే కేంద్రంలో రెండోసారి బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో మెడలు వంచడం కష్టమని జగన్ మొదట్లోనే చేతులెత్తేసిన విషయం తెలిసిందే.


కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే పనులు అవుతాయని గ్రహించి, ఆ విధంగా ముందుకెళుతున్నారు. సరే జగన్ పని జగన్ చేస్తున్నారు. మరి వైసీపీ తరుపున గెలిచిన 22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? అంటే చెప్పడం కష్టమే. ఈ రెండేళ్లలో ఎంపీలు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో ఎవరికి తెలియదు. కనీసం పార్లమెంట్ నిధులని అయిన ఖర్చు పెడుతున్నారా? అంటే అది చెప్పడం కష్టం.


టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నా సరే, వారు బాగానే రాష్ట్రం కోసం కేంద్రంలో పోరాటం చేస్తున్నారు. కానీ వైసీపీ ఎంపీలు కనీసం నోరు కూడా ఎత్తడం లేదు. అసలు చెప్పాలంటే టీడీపీకి చెందిన ఎంపీలు రాష్ట్ర స్థాయిలో హైలైట్ అయ్యారు గానీ, వైసీపీ ఎంపీలు మాత్రం సొంత పార్లమెంట్ స్థానాల్లోనే హైలైట్ కావడం లేదని తెలుస్తోంది. 22లో చాలామంది కేవలం జగన్ ఇమేజ్‌తోనే గెలిచేశారు. సరిగ్గా ఎంపీలు పేర్లు కూడా తెలియకుండానే ప్రజలు, జగన్‌ని చూసి వైసీపీకి ఓట్లు వేశారని చెప్పొచ్చు.


అయితే ఎన్నికలై రెండేళ్ళు అయిన సరే కొందరు ఎంపీలు, సొంత పార్లమెంట్ స్థానంలో ఉన్న ప్రజలకు సరిగ్గా తెలియదు. ఇక అలాంటి ఎంపీలకు నెక్స్ట్ జగన్ టిక్కెట్ ఇవ్వడం కష్టమే అని తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో పలువురు ఎంపీలని సీఎం జగన్ రీప్లేస్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: