ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యాబినెట్ లోకి రావడానికి కొంత మంది కాస్త ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం మీడియా వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమ జిల్లాలకు సంబంధించి కొంత మంది ఎలా అయినాసరే క్యాబినెట్ లోకి  రావాలని భావిస్తున్నారని ఉత్తరాంధ్రలో కూడా సీనియర్ నేతలుగా ఉన్న వారు ఎలా అయినాసరే క్యాబినెట్ లో ఉండేందుకు ఇప్పటినుంచే లాబీయింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైసిపి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ క్యాబినెట్ లో కి ఎవరిని తీసుకున్నా సరే వారు సమర్థవంతంగా పనిచేసే విధంగా ఉండాలి.

అయితే చిత్తూరు జిల్లా నుంచి ఆర్ కే రోజా ఈసారి క్యాబినెట్ లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆమె పోయినసారి క్యాబినెట్ లో ఉండాల్సిందని కానీ కొన్ని కారణాల వల్ల ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఆమెకు విభేదాలున్నాయి అనే అభిప్రాయం కూడా కొంతవరకు వ్యక్తమవుతోంది. అదే విధంగా మరో మంత్రి నారాయణస్వామి కూడా తన నియోజకవర్గంలో ఎక్కువగా వేలు పెట్టడం కూడా రోజాకు ఇబ్బందికరంగా మారింది.

ఈ సమస్యలన్నింటిని రోజా పరిష్కరించుకుందాం అని వాళ్లతో సయోధ్య కూడా పూర్తయిందని ఈ నేపథ్యంలో వాళ్లు కూడా రోజాను క్యాబినెట్ లోకి రావడానికి సానుకూలత వ్యక్తం చేశారని వైసిపి వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం, రోజా ఎంతవరకు క్యాబినెట్ లోకి వస్తారు ఏంటి అనేది తెలియక పోయినా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని క్యాబినెట్ లోకి వచ్చే విషయంలో దూకుడుగా ఉండటంతో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉండవచ్చని అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి రోజుకు ఖచ్చితంగా క్యాబినెట్ లో చోటు దక్కవచ్చు అని అయితే క్యాబినెట్ లో నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తొలగిస్తే కచ్చితంగా రోజా క్యాబినెట్లో ఉండవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: