టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంధ‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ...టీటీడీ పాల‌క‌మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ....గత రెండు సంవత్సరాలలో అనేక నిర్ణయాలు తీసుకున్నామ‌ని అన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్య‌త‌ ఇచ్చేలా ఎల్ 1 దర్శనాలు రద్దు చేసామ‌ని అన్నారు.  తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ చేసామ‌ని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామ‌న్నారు. తెలుగు రాష్ట్రాల‌లోని ఎస్సి, ఎస్టి ,మత్స్యకార కాలనీలో 500 ఆలయాలను రాబోవు ఏడాది కాలంలో నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చారు. దర్మప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మిస్తూన్నామ‌న్నారు. 

జమ్మూలో 62 ఏకరాల స్థలంలో 18 నెలలు కాలంలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామ‌ని చెప్పారు. త్వరలోనే ముంబాయి, వారణాసిలో ఆలయాలు నిర్మిస్తామ‌ని తెలిపారు. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 100 ఆలయాలకు గోవులను అందించామ‌ని చెప్పారు. వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం.... వాకిలికి వెండి తాపడం పనులు చేయిస్తున్న‌ట్టు తెలిపారు.  
గోవిందుడికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం సమర్పిస్తున్నామ‌ని అన్నారు. తిరుమల శ్రీవారి ట్రస్ట్ ద్వారా లభించిన నిధులను ఆలయాల నిర్మాణానికి ఖ‌ర్చుచేస్తామ‌ని అన్నారు. సెప్టెంబర్ చివరి లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని రెగ్యుల‌రైజ్ చెయ్యడానికి కమిటిని ఏర్పాటు చేసామ‌ని తెలిపారు.


వారం రోజుల్లో తిరుమలలోని అనధికార దుకాణాలను తొల‌గిస్తామ‌న్నారు. చిన్నపిల్లల ఆసుప్రతికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామ‌ని చెప్పారు. రాష్ట్ర‌ వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు నిర్మిస్తామ‌ని అన్నారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలగా తీర్మానం చేశామ‌ని... ఆకాశగంగ ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామ‌ని అన్నారు. మ‌గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తామ‌ని అన్నారు. తిరుమలను గ్రీన్ జోన్ గా ప్రకటిస్తూన్నామ‌ని తెలిపారు.  తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సలును రాష్ట్ర‌ ప్రభుత్వం కేటాయించిందన్నారు. భవిష్యత్తులో తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: