రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం వెంటిలేటర్ పైన ఉంది. ఇక ఏపీలో ప్రతిపక్షంలో ఉంటూ పోరాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి నాయకత్వం మారాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని పలువురు నందమూరి అభిమానులు మాట్లాడుతున్నారు. ఎక్కడకక్కడ చంద్రబాబు, నారా లోకేష్ సభల్లో ఎన్టీఆర్ అభిమానులు... జై ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి టిడిపి బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే కొందరు నాయకులు కూడా టిడిపి బ్రతకాలంటే ఎన్టీఆర్‌కి పార్టీ పగ్గాలు అప్పగించాలని మాట్లాడుతున్నారు. కానీ ఎన్టీఆర్‌కి టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందా? చంద్రబాబు అంత సులువుగా పార్టీని ఎన్టీఆర్ చేతుల్లో పెడతారా?  లోకేష్‌ని కాదని ఎన్టీఆర్‌ని అధ్యక్షుడిగా పెడతారా? అంటే చాలా కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా కొన్నేళ్లు చంద్రబాబు టిడిపిని నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు తర్వాత టిడిపి పగ్గాలు ఖచ్చితంగా నారా లోకేష్‌కే అప్పగిస్తారని అర్థమైపోతుంది. ఎందుకంటే లోకేష్ రాజకీయాలని చూస్తే అదే అని నిజమనిపిస్తుంది. ఇప్పటికే లోకేష్‌లో చాలా మార్పులు వచ్చాయి. టిడిపి భవిష్యత్ నాయకుడు లోకేష్ అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.

లోకేష్ కూడా అందుకు తగ్గట్టుగానే రాజకీయం చేస్తున్నారు. మునుపటి లాగా కాకుండా పూర్తిగా మాట తీరు, వంటి తీరు రెండు మారాయి. ఏ విషయమైనా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ, అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు. ఇబ్బందుల్లో ఉన్న టిడిపి నేతలని  ఆప్యాయంగా పలకరిస్తున్నారు.  కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. జనాల్లోకి త్వరగా వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితులు చూసుకుంటే భవిష్యత్తులో టిడిపి బాధ్యతలు లోకేష్‌కే అప్పగిస్తారని అర్థమవుతుంది.

ఇప్పటికే టిడిపి క్యాడర్ కూడా మానసికంగా లోకేష్‌ కాబోయే అధినాయకుడు అని  ఫిక్సైనట్లు కనిపిస్తుంది.  వారు కూడా ఎన్టీఆర్‌కి బాధ్యతలు అప్పగించాలని అనుకోవడం లేదని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ టిడిపికి మద్దతుగా ఉంటే రాజకీయంగా బలపడుతుందని భావిస్తున్నారు. అలాగే లోకేష్, ఎన్టీఆర్‌లు కలిసి మెలిసి పార్టీ నడిపిస్తే అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. మరి భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: