పోరాటాల పార్టీ కాదు కానీ
పోరాడ‌డంలో
త‌ప్పు మాత్రం లేద‌న‌కునే పార్టీ
తెలుగు దేశం పార్టీ


కేంద్రం నుంచి  రాష్ట్రం వ‌ర‌కూ
ఎవ్వ‌రు
త‌మ‌ను ప‌ట్టించుకున్నా లేకున్నా
త‌న నిర‌స‌న మాత్రం వినిపించ‌క
మానుకోవ‌డం లేదు
ఇది ఇటీవ‌ల వ‌చ్చిన మార్పు
అధికారం దూరం అయిన రెండేళ్ల‌కు వ‌చ్చిన మార్పు


అటు బీజేపీ
ఇటు క‌మ్యూనిస్టు

పోరాటంలో అల‌సిపోవ‌డం నాయ‌క‌త్వ ల‌క్ష‌ణం కాదు.అరెస్టుల‌కు బెదిరిపోవ‌డం కూడా నాయ‌కుడి ల‌క్ష‌ణం కాదు. ఇప్పుడిప్పుడే బాగా ప‌నిచేయాల‌న్న త‌ప‌న ఉన్న యువ నాయ‌కుల నేతృత్వంలో జిల్లా క‌మిటీలు ఏర్ప‌డంతో టీడీపీ కొత్త పంథాలో ప‌నిచేసేందు కు సిద్ధం అవుతుంది.రాష్ట్ర ప్ర‌భుత్వంకు సంబంధించి పాల‌నా ప‌ర‌మైన లోపాల‌ను వెల్ల‌డి చేయ‌డంలో ముందుంటుంది. ఇదే సమ యంలో అటు కేంద్రంలోనూ మునుప‌టి హ‌వాను కొన‌సాగి స్తుండ‌డం విశేషం.బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతారో లేదో కానీ కొన్ని ప్ర‌త్యామ్నా యాల వైపు టీడీపీ చూస్తుంద‌ని తెలుస్తోంది. వీటిని కూడా ప్ర‌జా  పోరాటాల‌ను వినియోగించుకునే త‌మ బ‌లాల‌ను పెంపొందించు కుంటే మేలు అని భా విస్తోంది.బీజేపీలో త‌న ఏజెంట్లు ఎలానూ ఉన్నారు క‌నుక ఉన్నంత మేర టీడీపీ ఆ పార్టీతో త‌గాదాలు పెట్టుకో వ‌డం జ‌ర‌గ‌ని ప‌ని అని, కానీ ప్ర‌జ‌ల ముంద‌ర మాత్రం వైరం ఉన్న‌ట్లే ప్ర‌వ‌ర్తించ‌డం ఆ పార్టీ నాయ‌కుల‌కే చెల్లు అని వైసీపీ చెబుతోంది. 


.....ముందు క‌న్నా
...పోరాటం మారింది

 
క‌రోనా కాలంలో పోరాటాల‌కు అనువే లేని కాలంలో టీడీపీ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.త‌న‌దైన పంథాలో ఆన్ లైన్ వేదిక‌లు మొ ద‌లుకొని, ప‌లు చోట్ల ధ‌ర్నాలూ,నిర‌స‌న‌లూ చేప‌ట్టే వ‌ర‌కూ అన్నింటా యాక్టివ్ గా ఉంటోంది.అవ‌సరం అయితే కామ్రెడ్ల‌ను క‌లుపు కునిపోతోంది. కొన్నింట అవ‌స‌రం లేక‌పోతే వారిని వ‌దిలి మ‌రీ! ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఉపాధి హామీ ప‌థ‌కంకు సంబం ధించి పెండింగ్ బిల్లుల‌కు సంబంధించి నిధుల విడుద‌ల‌లో రాష్ట్రం జాప్యం చేస్తుంద‌ని నిన్న అన్ని జిల్లాల‌లోనూ నిర‌స‌న‌లు చేప ట్టింది టీడీపీ. ఇక్క‌డ ఇలాంటి నిర‌స‌న‌లు నిర్వ‌హిస్తుంటే,అక్క‌డ అంటే ఢిల్లీలో  ఇదే స‌మ యంలో వామప‌క్షాల‌తో క‌లిసి విశాఖ స్టీ ల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ త‌న గొంతుక వినిపించింది. ఉపాధి ప‌నుల బ‌కాయిలు రెండు వేల ఐదు వంద‌ల కోట్ల రూ పాయ‌ల మేర‌కు ఉంద‌ని పేర్కొంటూ తెలుగు యువత సైతం క‌దంతొక్కింది. విజ‌య‌నగరం లాంటి జిల్లాల‌లో చాలా యాక్టివ్ గా ఉ న్న విభాగాల‌లో ఒక‌టైన తెలుగు యువ‌త త‌న ఉద్య‌మ పంథాను కొన‌సాగించింది. అదేవిధంగా స్థానికంగా కూడా వైసీపీపై ఉన్న అస‌హ‌నాన్ని ప్ర‌జల‌కు అర్థం అయ్యేలా చెప్పేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది.అధికార పార్టీ కేసులు బ‌నాయిస్తూ పోతున్నా కొందరు మాత్రం త‌గ్గ‌డం లేదు.చంద్రబాబు సైతం ఇదే విధంగా దిశా నిర్దేశం చేస్తున్నార‌ని,అరెస్టులు అయితేనే ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరుగుతుంద‌ని,గ‌తంలో నెల‌కొన్న వ్య‌క్తిగ‌త క‌క్షల కార‌ణంగా వేధిస్తున్న వైనం ఏంట‌న్న‌ది కూడా తెలుస్తుంద‌ని చెబు తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: