ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. ఏప్రియల్ 8 న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ ముందుగానే బ‌హిష్క‌రించింది. అయితే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నంత‌లో పోరాటం చేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏలూరి సాంబ‌శివ‌రావు ఇచ్చిన ప్రోత్సాహంతో స్తానిక టీడీపీ కేడ‌ర్ గ‌ట్టిగా ఫైట్ ఇచ్చింది. ఈ రోజు వెలువ‌డుతోన్న ఫ‌లితాల్లో టీడీపీ కొన్ని స్థానాల్లో మంచి విజ‌యాలు సాధిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని చిన్నగంజాం మండలం పెద్దపల్లె పాలెం తెదేపా ఎంపీటీసీ అభ్యర్థిని  పీత భార్గవి గారి విజ‌యం సాధించారు.

అలాగే మార్టూరు మండ‌లం జొన్న తాళి ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని మానం కళ్యాణి 74 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. యద్దనపూడి మండలం పెద్ద జాగర్లమూడి ఎంపీటీసీ గా బొల్లినేని సాంబయ్య గెలిచారు. అన్నంబోట్లవారి పాలెం ఎంపీటీసీ చెన్నుపాటి రమాదేవి గెలుపు బావుటా ఎగ‌ర వేశారు. ఇక ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన కారంచేడులో కారంచేడు ఎంపీటీసీ 2 నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచిన యార్లగడ్డ అక్కయ్య చౌదరి  163 ఓట్లతో ఘన విజయం సాధించారు.

దేవరపల్లిలో టీడీపీ విజయం సాధించింది. ఇక్క‌డ ఎంపీటీసీ గా కాపు రామచంద్ర విజయభేరీ మ్రోగించారు. మార్టూరు మండ‌లంలోని వలపర్ల తూర్పు ఎంపీటీసీగా జంజనం పద్మ టీడీపీ గెలుపు బావుటా ఎగ‌ర‌వేవారు. ఇక్క‌డ ఆమెకు ఏకంగా 140 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.  ఏదేమైనా ఈ ఎన్నిక‌ల‌ను టీడీపీ పూర్తిగా బ‌హిష్క‌రించేసింది. ఎమ్మెల్యే ఏలూరి ఉన్నార‌న్న అండ‌దండ‌ల‌తో స్థానిక టీడీపీ కేడ‌ర్ కొన్ని చోట్ల పోరాటం చేస్తే వ‌చ్చిన ఫ‌లితాలు ఇవి.
నియోజ‌క‌వ‌ర్గంలోని ఆరు మండ‌లాల్లోనూ ఎన్నిక‌లు బ‌హిష్క‌రించినా కూడా టీడీపీ మంచి ఓటింగ్ సాధించింది. అదే ఎన్నిక‌లు స్ట్రిట్‌గా జ‌రిగి ఉండి.. వీటిని టీడీపీ బ‌హిష్క‌రించ‌కుండా ఉండి ఉంటే... ప‌రుచూరులో టీడీపీ మ‌రిన్ని మెరుగైన విజ‌యాలు న‌మోదు చేసి ఉండేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఏలూరి మ‌రోసారి తానెంత స్ట్రాంగో లీడ‌రో చాటుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: