రోజురోజుకీ టెక్నాలజీలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి..  ఆ మార్పులు మనిషి జీవన శైలి లో కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెట్రోల్ తో నడిచే కార్లు బైకులు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇలాంటివే ప్రస్తుతం ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. కానీ నేటి రోజుల్లో టెక్నాలజీలో మార్పుల కారణంగా  పెట్రోల్ డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు జనాలు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు సామాన్యుడికి భారంగా మారడం.  రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగి పోతుండటంతో వాహనం బయటికి తియ్యాలి అంటేనే భయపడిపోతున్నారు సామాన్య ప్రజలు.



 దీంతో ఇక పెట్రోల్ వాహనాలను వదిలేసి ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎన్నో వాహన తయారీ కంపెనీ లు ఇక వినూత్నమైన టెక్నాలజీతో వాహనాలు తయారు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇక ప్రస్తుతం పలు రకాల వాహనాలు తయారీ దశలో ఉన్నాయి.  ఇక రానున్న రోజుల్లో పెట్రోలు వాహనాలు స్వస్తి పలికే రోజు వస్తుందని ఇప్పటికే ఎంతో మంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ మంజూల్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు.



 ప్రపంచ దేశాల మాదిరిగానే భారత్ కూడా స్వచ్ఛ ఇంధనాల వాహనాల దిశగా వెళ్లే సమయం ఆసన్నమైందంటూ నవీన్  వ్యాఖ్యానించారు. 2027 నాటికి భారత్లో ద్విచక్రవాహనాల విక్రయాలు పూర్తిగా విద్యుత్ తోనే ఉండే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సమయం వరకు పెట్రోల్ ఆధారిత వాహనాల విక్రయాలు ఆపేయాలని తెలిపిన ఆయన.. అధిక ధరలు ఛార్జింగ్ వసతుల లేమి కారణంగానే భారత్లో విద్యుత్ వాహనాలకు గిరాకీ లేదు అంటూ చెప్పుకొచ్చారు. కార్ల కంటే బైక్ల తోనే ఎక్కువ కాలుష్యం జరుగుతుంది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: