ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో... అయోధ్యపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది యోగీ ఆదిత్యా నాథ్ సర్కార్. ఇప్పటికే అయోధ్యలో రాములోరి ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని శర వేగంగా చేస్తోంది యోగీ సర్కార్. 2022 డిసెంబర్ నాటికి ఆలయాన్ని పూర్తి చేయాలనే టార్గెట్‌ పెట్టుకుంది యోగీ సర్కార్. ఇప్పటికే బేస్‌మెంట్ పనులు పూర్తి చేసినట్లు రామాలయ కమిటీ సభ్యులు ప్రకటించారు కూడా. ప్రతి ఏటా అయోధ్యలో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు నిర్వాహకులు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు నిర్వాహకులు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో. ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా దాదాపు 500 డ్రోన్‌లతో ప్లాన్ చేసింది ఆదిత్య సర్కార్. మొత్తం 500 డ్రోన్‌లు ఎగురుతూ అయోధ్యలో ఆకాశాన్ని వెలిగించేదుకు ఏర్పాటు చేశారు. దీపోత్సవం సందర్భంగా ఏరియల్ డ్రోన్ షోను తొలిసారి నిర్వహించాలని యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం మెగా ప్లాన్ వేసింది.

మొత్తం 15 నిమిషాల నిడివు ఉండేలా ఏరియల్ డ్రోన్ షో ప్లాన్ చేశారు. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ ఈవెంట్‌ను మరింత గ్రాండ్‌గా చేయాలని చూస్తున్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో ఏకంగా 1,824 డ్రోన్‌లతో ఆకాశంలో అద్భుతం సృష్టించారు. ఒలింపిక్స్‌కు కబుకి చెకర్ చిహ్నాన్ని డ్రోన్‌లతో రూపొందించారు. రాముడి కథను, రామాయణ సమగ్ర యానిమేషన్‌ను డ్రోన్ ద్వారా ప్రదర్శించాలని యూపీ సర్కార్ భావిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రదర్శనను ఏర్పాటు చేసింది యూపీ సర్కార్. ప్రతి డ్రోన్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లతో ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. మల్టీ రోటర్ విధానంతో... 400 మీటర్ల ఎత్తులో డ్రోన్ కెమెరాలతో ఈ మెగా ఈవెంట్ సాగనుంది. సమర్థవంతమైన, ఆకట్టుకునే మార్ఫింగ్ కోసం  ఖచ్చితమైన జీపీఎస్ కలిగి ఉండేలా చూస్తున్నారు. డ్రోన్ టేకాఫ్, ల్యాండింగ్ కోసం ప్రత్యేక బారికేడ్ ప్రాంతం ఏర్పాటు చేశారు. ఈ వేడుక కోసం యోగి ఆదిత్యానాథ్ సర్కార్ ఏకంగా 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: