విద్యుత్ రంగంలో ఇప్పుడొస్తున్న వార్తలు.. అందుకు సంబంధించిన సవరణలపై వైసీపీ బలమయిన వాదన ఒకటి వినిపించలేక పో తోంది. అదేవిధంగా చంద్రబాబు హయాం లో జరిగిన పీపీపీలపై గొంతు పూర్తి స్థాయిలో వినిపించలేకపోతోంది. ముఖ్యంగా ఆ రోజు ప్రయివేటు సంస్థలకూ,  ప్రభుత్వానికీ మధ్య జరిగిన కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన స్వార్థ రాజకీయాలు, జరిగిన మోసాలు, క్విడ్ ప్రోకో తదితరాలపై ఎందుకని వైసీపీ గాఢతతో కూడిన గొంతుకలతో మాట్లాడలేకపోతోందో! అయినప్పటికీ ఆ రోజు  జరిగిన మత లబుల కారణంగానే డిస్కంలు ఈ రోజు భారం మోస్తున్నాయి అన్నది వాస్తవం. బహిరంగ మార్కెట్లో యూనిట్ విలువ నాలుగు రూపాయలు ఉన్న చోట, ఏడు  రూపాయల కు కొనుగోలు చేసి, తమకు అనుకూలంగా, తమకు అనుగుణంగా నడుచుకునే సంస్థల వైపు మొగ్గు చూపుతూ, డిస్కంలకు ఆర్థిక భారం పెంచారు.



అదేవిధంగా ఇవాళ సంబంధిత రుణాలు కానీ వడ్డీలు కానీ రుణం వడ్డీ కలిపి కానీ చెల్లించే క్రమంలో డిస్కంలు మోతాదుకు మించిన భారం మోస్తున్నాయి. కానీ ఇవేవీ పట్ట కుండా సర్దుబాటు ఛార్జీల పేరిట జగన్ ఏకపక్షంగా పోతున్నారని చంద్రబాబు మాట్లాడడం తగని పని అని సంబంధిత నిపుణులు అంటున్నారు. అదేవిధంగా కేంద్ర విద్యుత్ చట్టం - 2003 ను అతిక్రమిస్తూ బాబు తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఇవాళ వినియోగదారులకు ఇంతటి భారం నెత్తిన పడిందన్న వాస్తవం ఒకటి అంతా గుర్తించాలి.


విపక్షాలు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే, పాలకపక్షాలు గణాంక సహితంగా మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడలేనప్పుడు అబద్ధాలు ఒకటికి రెండు ప్రాచూర్యంలోకి వచ్చి, అవే నిజాలుగా చెలామణీ అవుతాయి అన్నది వాస్తవం. ఇదే లోక రీతి కూడా! లోక రీతికి భిన్నంగా ఏమయినా చేస్తే అప్పుడు అదొక మార్పు అవుతుంది. వైసీపీ స ర్కారు తరఫున మాట్లాడే మనుషులు చంద్రబాబు చెప్పే అబద్ధాలను నమ్మొద్దు అని చెబితే చాలదు. అవి ఎందుకు అబద్ధాలు ఏ విధంగా అవి వాస్తవ దూరాలు అన్నవి ని రూపణలోకి తెస్తేనే తగిన ఫలితం.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap