ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ లో అస‌లేం జ‌రుగుతుందో ?  కూడా ఎవ్వ‌రికి అర్థం కాని ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల్లోనే పార్టీ 23 సీట్లు సాధించ‌డంతో ఆ పార్టీ వీరాభి మానుల‌కు సైతం పార్టీకి ఫ్యూచ‌ర్ ఉంటుంద‌న్న గ్యారెంటీ లేకుండా పోయింది. ఇక పార్టీ నుంచి గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యే లు సైతం బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌లో ఓడిపోయిన ప‌లువురు కీల‌క నేత‌లు సైతం పార్టీని వీడ‌డ‌మో లేదా సైలెంట్ అయిపోవ‌డ‌మో చేస్తున్నారు.

ఇక చంద్ర‌బాబు పార్టీ ని కాపాడుకు నే క్ర‌మంలో పార్టీలో కాస్త యాక్టివ్ గా ఉన్న నేత‌ల‌తో పాటు యువ నేత‌ల‌కు కొంద‌రికి ప‌ద‌వులు ఇచ్చారు. అయితే వీరిలో చాలా మంది యాక్టివ్ గా ఉండ‌డం లేదు. ఇప్పుడు పార్టీ ఏ ప‌రిస్థితి లో ఉంది గ్ర‌హించిన చాలా మంది అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా పార్టీ గెలుస్తుందా ? అంటే డౌటే అంటున్నారు. అందుకే వీరిలో చాలా మంది పార్టీకి దూరం దూరం అంటున్నారు.

మ‌రి కొంద‌రు ఇప్ప‌టి నుంచే యాక్టివ్ గా ఉంటే భారీగా చేతి చ‌మురు వ‌దిలిం చు కోవాల్సిన ప‌రిస్థి తి ఉంటుంద‌ని.. అందుకే మ‌రీ ఓవ‌ర్ గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నా ఉప‌యోగం ఉండ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. మ‌రి కొంద‌రు చివ‌రి యేడాది లో  నో లేదా.. చివ‌రి ఆరు నెల‌ల్లోనే యాక్టివ్ అవుదాం లే అన్న నిర్ణ‌యంతో ఉన్నారు.

ఇక  కొంద‌రు సీనియ‌ర్ల తో పాటు పార్టీ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు యాక్టివ్ అయితే ఎక్క‌డ అధికార పార్టీ నేత‌ల‌కు టార్గెట్ అవుతామో ? ఎక్క‌డ వ్యాపారాలు దెబ్బ తింటాయో ? అన్న ఆందోళ‌న‌తో బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని పార్టీలోనే చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి ఈ లెక్క‌న పార్టీ ఎలా బ‌ల‌ప డుతుందో ?  వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: