గత కొద్దిరోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి మరియు వైసిపి  పార్టీలో రచ్చ అనేది తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారి ఢిల్లీకి చేరుకున్నాయి. దీంతో చంద్రబాబు  త్వరలో ఢిల్లీకి వెళ్లాలని ఆలోచన  చేస్తున్నారు. టిడిపి ఏపీ పరిణామాలపై ఢిల్లీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. తాజా రాజకీయ పరిణామాలపై నిరసన దీక్షకు దిగారు చంద్రబాబు. ఈ సాయంత్రం చంద్రబాబు 36 గంటల దీక్ష పూర్తవనుంది. దీక్ష తర్వాత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. వైసిపి పై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఎమర్జెన్సీని విధించాలని వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలంటోంది టీడీపి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనధికారికంగా చెప్పినటువంటి ఈ సమాచారాన్ని బట్టి ఇంకా ఆమె అపాయింట్మెంట్ ఫిక్స్ కాలేదు. దీనికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

శనివారం,ఆదివారం, సోమవారం,మంగళవారం ఎప్పుడైనా గాని సమయం ఇచ్చినట్లయితే వచ్చి కలుస్తామని అడగడం జరిగింది. ప్రధానంగా భారత రాజ్యాంగ పరిరక్షకుడయినటువంటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి ఆ మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను వివరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మరియు విచ్చలవిడిగా గంజాయి సాగు వివిధ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ నుండే సరఫరా అవుతుందన్న అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్నది టిడిపి పార్టీ యొక్క ఆలోచన .

 కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, నరేంద్ర మోడీని, రామ్ నాథ్ కోవింద్ ఈ ముగ్గురినీ కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని  మరియు శాంతిభద్రతలను నాశనం చేస్తున్నారనే ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ముగ్గురి దృష్టికి తీసుకెళ్లేలా చూస్తున్నారు. దీంతో త్వరలో చంద్రబాబు ఢిల్లీకి పయనం అవుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: