తిట్టి తిట్టి నోరెళ్ల బెట్టాడు ఒక‌డు.. తిట్లు తిని నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు ఒక‌రు.. తిట్ల‌తోనే రాజకీయం న‌డిపి హిట్టు కొట్టాల‌నుకుం టున్నాడు ఒక‌డు.. తిట్లు తిని సానుభూతి పొంది మ‌ళ్లీ అధికారం పొంది హాయిగా ఉందామ‌న్న భావ‌న‌లో  ఉన్నారు ఒక‌రు.. ఇవ‌న్నీ టీడీపీ మ‌రియు వైసీపీకి చెందిన పరిణామాల క్ర‌మం. మ‌నం అలా విని  పోవాలి. విని కూడా ఊరుకోవాలి. ఏదేమైన‌ప్ప‌టికీ ప‌ట్టాభి ఊరెళ్లాడు. పాపం పిల్లాడు .. భ‌య‌ప‌డి పారిపోయాడు అని అంటున్నారు వైసీపీ నేత‌లు. అంతేకాదు మా నేత‌ను ఎవ‌రు తిట్టినా దేశం వ‌దిలి పోవాల్సిందే కానీ మేం వ‌దిలి పెట్టేదే లేద‌ని నేత‌లు అన‌గా అధికార పార్టీ నేత‌లు అంటున్నారు. ఇది కూడా నిజ‌మే అని అనిపించేలా నిన్న‌టి పరిణామాలు ఉన్నాయి. బాబు ద‌గ్గ‌రుండి దేశం దాటించేశార‌ని అంటున్నారు. ఇదంతా బాగుంది కానీ ఇంకొన్ని తిట్లు ఉన్నాయి మేం తిడ‌తాం మీరు ప‌డండి అని అంటున్నారేంటి..అదే అర్థం కావ‌డం లేదు.. ఇదే ఇప్పుడు గో ప్యంగా న‌డుస్తున్న టాపిక్.

మ‌ళ్లీ ప‌ట్టాభిలాంటి స్టంట్ ఒక‌టి ప్లే చేయాల‌ని టీడీపీ భావిస్తోంది. ఎందుకంటే దూష‌ణ అన్న‌ది రాజ్య ద్రోహం కాదు అని తేలిపోయిం ది క‌నుక దేశ బ‌హిష్క‌ర‌ణ లాంటి చ‌ర్య‌లు సంఘ బ‌హిష్క‌ర‌ణ లాంటి చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు అస్స‌లు ఆస్కార‌మే లేదు అని కోర్టులే చె ప్పేశాయి క‌నుక ఎలా అయినా ఈ సారి ఊరు దాటి పోయేందుకు సిద్ధ‌మై నాలుగు తిట్లు తిట్టి మీడియాలో ప‌బ్లిసిటీ తెచ్చుకుని అటుపై అధినేత ద‌గ్గ‌రా మార్కులు కొట్టేసి ఫ్లైట్ ఎక్కి పోదాన్న‌ది కొంద‌రి టీడీపీ నాయ‌కుల ప్లాన్.

మ‌రోవైపు వైసీపీ మాత్రం తిట్లు తిని వాటి ద్వారా ఎంతో కొంత సానుభూతి పొందాల‌ని, టీడీపీ తిట్ల‌కు కొత్త అర్థాలేవో వెతుకుతోంది.
ఇందుకు మొన్నటి వేళ పోలీసు అమ‌ర వీరుల దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడిన మాట‌లు కొంద‌రి నేత‌లకు ప్రేర‌ణ ఇచ్చాయి. అంతేకాదు ఎన్న‌డూ సౌమ్యంగా ఉంటే నేత‌లు కూడా త‌మ‌కు మైలేజ్ రావాలంటే, అధినేత ద‌గ్గ‌ర మార్కులు కొట్టేయాలంటే, ప‌ద‌వులు కొట్టేయాలంటే తిట్లు తిట్టే సంప్ర‌దాయం మ‌నం ఎందుకు అల‌వ‌ర్చుకోకూడ‌దు అన్న ఆలోచన‌లో కూడా ఉన్నారు.



ఇప్ప‌టికే కింజ‌రాపు కుటుంబాన్ని తిట్టీ తిట్టీ ప‌ద‌వి కొట్టాడు దువ్వాడ శ్రీ‌ను. ఎమ్మెల్సీ గా ఉంటూ త‌న నియోజ‌క‌వ‌ర్గం టెక్క‌లిలో విప‌క్ష పార్టీ టీడీపీకి చుక్క‌లు చూపిస్తున్నాడు. అయితే వైసీపీ కోవ‌ర్టులు కొంద‌రు టీడీపీకి బాగానే స‌హ‌క‌రిస్తుండ‌డంతో ఇప్ప‌టికిప్పుడు ప‌సుపు పార్టీకి వ‌చ్చే ఇబ్బంది అయితే లేనేలేద‌ని తెలుస్తోంది. ఇలా అన్ని చోట్లా కోవ‌ర్టులు ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసి ప‌క్క పార్టీకి సాయంచేసే వాళ్లే ఎక్కువ. వారిపై కూడా ఓ క‌న్నేసి ఉంచాలి. కానీ భోళా మ‌నుషులు పార్టీ అధినాయ‌కులుగా ఉంటే ఏం చేయలేం? ఏదైతేనేం ఊరెళ్లారు క‌దా ప‌ట్టాభి ఇంకొన్ని తిట్లు సిద్ధం చేస్కోండ్రి ప‌ట్టాభి! మీరెంత తిడితే మీ పార్టీకి అంత మైలేజ్ అన్న‌ది మీ పార్టీ అనుకుంటున్న మ‌రియు భావిస్తున్న విష‌యం.


మరింత సమాచారం తెలుసుకోండి: