హాయిగా తిట్టండి హాయిగా దేశం దాటి పోండి ఇదే కాబోలు ఇవాళ్టి రాజ‌కీయం.. రేప‌టికి ఆచ‌ర‌ణీయం..అనుస‌ర‌ణీయం కూడా కావొచ్చు.. అనుకుంటాను.. కాక‌పోతే మేలు.. అయ్యో! అధినేత‌లే ఫోన్లు చేసి మ‌రీ! ఏ తిట్లు ఏ విధంగా ఏ స‌మ‌యంలో తిట్టాలో చెబుతుంటే ఇంకేం ఎవ్వ‌ర‌యినా ఆగుతారా చెప్పుండ్రి! మ‌నం ఏం అనుకున్నా ఎన్ని అనుకున్నా మంచి వాడు ప‌ట్టాభి. నాలుగు తిట్లు తిట్టి ఊరెళ్లి పోయాడు. ప‌గ‌డ‌పు దీవులుగా పేర్కొనే మాల్దీవుల‌కు పోయాడు. హాయిగా వెకేష‌న్ ను ఎంజాయ్ చేయ‌నున్నా డు. అధినేతే ద‌గ్గ‌రుండి పంపిచేశాడ‌ని టాక్ . వైసీపీ చెబుతున్న మాట అని రాయాలి.


మ‌రి! ఆయ‌నెందు కు ఊరు వెళ్లిండో కానీ, ఆయ‌న వెళ్లినంత మాత్రాన రాజ‌కీయాలు మాత్రం ఒక్క‌సారిగా ఏమీ మారిపోవు. ఏవి ఎలా ఉండాలో అలానే ఉంటాయి. అధినేత మెప్పు కోసం కొంద‌రు ఇప్పుడు ప‌ట్టాభి సూత్రాన్ని ఫాలో కావాల‌ని చూస్తున్నారు. కొంద‌రైతే అదే ఫాలో అయిపోతున్నారు. ఈ ఇబ్బంది టీడీపికే కాదు వైసీపీకి కూడా ఉంది. రా రా చూస్కొందాం అన్న సినిమా డైలాగులు ఇరు శిబిరాల నుంచి హాయిగా వినిపిస్తున్నాయి. విసిగిస్తున్నాయి. అయినా ప‌రిణామాల్లో పెద్ద‌గా మార్పు లేదు. ఎవ్వ‌రూ ఎవ్వ‌రినీ నియంత్రించ‌లేన‌ప్పుడు అధినేత ప‌ద‌వుల్లో ఉండి ఏం లాభం?

తాజాగా టీడీపీ నుంచి కొందరు నాయ‌కులు కొత్త తిట్ల దండ‌కం ఒక‌టి అందుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ తిట్ల స్థాయి ఎలా ఉంటుందో అని చాలా మంది భ‌య‌ప‌డిపోతున్నారు. ఇప్ప‌టికే అనేక చోట్ల ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఒక‌టి నెల‌కొని ఉంది. అది నివురు గ‌ప్పిన నిప్పులా ఉంది. టీడీపీ ని తిట్టేందుకు స్పీక‌ర్ సీతారాం కూడా వెన‌క్కు త‌గ్గ‌రు. దువ్వాడ శ్రీ‌ను అనే ఎంఎల్సీ కూడా త‌గ్గ‌రు. ఇంకా రాయ‌ల‌సీమ‌లో అయితే స్వామి భ‌క్తుల‌కు క‌రువే లేదు. ఇప్పుడు వీళ్లంతా తిట్టి ఏం సాధిస్తారు. వీళ్ల‌కు బాక్సింగ్ నేర్పండి అని సెటైర్ వేశాడు ఆర్జీవీ.

రాజ‌కీయాల్లో ప‌ద‌వులు శాశ్వ‌తం కాదు కానీ తిట్లు మాత్రం శాశ్వ‌త‌మే. గతంలోనూ ఇలాంటి పరిణామాలే ఉన్నాయి. ఇందిరా గాంధీ పాల‌న స‌మ‌యంలో కూడా ఇంత‌టి తీవ్ర స్థాయిలోనే అరుణ్ శౌరి లాంటి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు ప‌దాల‌ను ఉప‌యోగించార ని అప్ప‌టి మ‌నుషులు చెబుతున్న మాట. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎంతో తేడా క‌నుక వారు ఏ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడారు వీరు ఏ ఉద్దేశాల‌ను ఆపాదించుకుని మాట్లాడుతున్నారు అన్న‌ది గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యాలు. ఏదేమైన‌ప్ప‌టికీ ప‌ట్టాభి తిట్ల‌కు డిక్ష‌న‌రీ అర్థాలు వెతుక్కోవ‌డం అన్న‌దే పెద్ద జోక్. అన‌వ‌స‌రంగా ఆయ‌న‌ను పెద్దాడ్ని చేశారు క‌దా!

మరింత సమాచారం తెలుసుకోండి: