ప్రస్తుతం తెలంగాణాలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది హుజూరాబాద్ ఎన్నికలు. అటు సామాన్య ప్రజలు  ఇటు ప్రముఖులు కూడా ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేదాని పై  ఆసక్తి గా ఉన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సంగ్రామంలో ప్రచార గడువు రెండు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. హోరాహోరీ పోరులో రేపటితో కీలకమైన ప్రచార ఘట్టం ముగియ‌నుంది. టీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్‌ ప్రధాన పార్టీలకు ఈ ఉప ఎన్నిక సవాలుగా మారింది. ఇక మూడు పార్టీల  అగ్రనాయకత్వం  అంతా హుజురాబాద్ లొనే మాకాం వేసీ మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. ఇక ఈ పోటీలో మొత్తం 30 మంది అభ్య‌ర్థులు ఉన్నారు. రేప‌టి సాయంత్రం 7 గంట‌ల‌తో ప్రచార గ‌డువు ముగుస్తుండ‌డంతో రేపు మూడు పార్టీల అభ్య‌ర్థులు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన హుజూరాబాద్‌, జమ్మికుంటలతో పాటు మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు మండ‌లాలు మున్సిపాల్టీలు కూడా. దీంతో పాటు వీణ‌వంక మండ‌లం కూడా అభ్య‌ర్థుల గెలుపు ఓట‌ములు నిర్ణ‌యించ‌డంలో కీల‌కం కానుంది. ముందుగా ఇక్క‌డ ప్ర‌చారానికి రావాల‌ని సీఎం కేసీఆర్ అనుకున్నారు. ఇక ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి  కేసీఆర్‌ సమావేశం ఇక లేనట్టే అని అర్థ‌మ‌వుతోంది.

హుజురాబాద్ టీఆర్ ఎస్ గెలుపు ఆశ‌లు అన్నీ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి మంత్రి హరీశ్‌రావు పైనే ఉన్నాయి. పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ గెలుపుకు ఆయ‌న బాగా క‌ష్ట‌ప‌డుతూ కృషి చేస్తున్నారు. ఇక బీజేపీ చివ‌రి రెండు రోజుల్లో రోడ్ షోలే చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ కీల‌క నేత‌లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి - రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ - సినీ నటి విజయశాంతి - డీకే అరుణ - ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీ అర్వింద్ ప్ర‌చారంలో ఉన్నారు.

ఇక టీ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ తరపున చివరి రోజు ప్రచారానికి వ‌స్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: