ప్రస్తుతం భారతదేశంలో గొప్ప అవకాశం ఎదురుచూస్తుంది. గతంలో పోగొట్టుకున్న అవకాశం మరోసారి భారతదేశం తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని పోగొట్టుకొన్నసమయంలో పడిన వేదన అంతా ఇంతా కాదు. అనుకోకుండా మళ్ళీ అవకాశం వచ్చింది, దీనిని సద్వినియోగం చేసుకొని దేశాన్ని అభివృద్ధివైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖ్యంగా నేతల పాత్ర ఇందులో ఎంతైనా ఉంది. ఇప్పటికే ప్రజా క్షేత్రంలో ఎన్నుకోబడి ఉన్నారు సహా ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా ఈ అవకాశం పట్ల బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజలను నేతలు మార్గదర్శనం చేస్తూ, తలా ఒక పని చేసుకుంటూ దినదినాభివృద్ధి చెందాలి. అది అందరి కృషితోనే సాధ్యపడుతుంది.

కానీ ప్రస్తుతం దేశంపై జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా కుట్రలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ సమస్య ఎటునుండి వస్తుందో అని కనురెప్ప వేయకుండా కాపలా ఉంటూనే దేశాన్ని ముందు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నేడు ఉంది. అంటే అవకాశం ఒకపక్క తరుముకుంటూ వస్తుంది, మరోపక్క ప్రమాదం కూడా అదే స్థాయిలో వెంటాడుతూనే ఉంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూనే, ప్రమాదంపై ఒక కన్నేసి జాగరూకతతో ఉండాల్సిన సందర్భం ఇది. ఈ సమయంలో దేశంలో అన్నివర్గాలు కలిసి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందరు తమకు తామే బాధ్యతలను కేటాయించుకుని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు అడుగు ముందుకు వేసి స్పష్టం చేస్తే, తద్వారా నాయకత్వానికి చేకూర్చినవారవుతారు. అప్పుడు  ఇంకా చక్కగా, త్వరగా కూడా ఫలితాలు వస్తాయి.

ఇదంతా జరగాలి అంటే, దేశంలో స్వార్ధ రాజకీయాలను ఆయా పార్టీలు  మానుకోవాల్సి ఉంది. ఆయా సభలలో పోట్లాడుకోవడం మానేసి, ప్రజలను ఉద్దేశించి ప్రస్తుత అవకాశాన్ని స్పష్టంగా చెప్పి, అందుకు వాళ్ళ సహకారాన్ని కోరాలి. అంటే కానీ ఎవరికి వారు స్వార్ధ ప్రయోజనాలు చూసుకుంటే పోయేది అవకాశమే కాదు, పక్కనే ఉన్న ప్రమాదం మరింత తీవ్రమైన పరిస్థితులను తెస్తుంది. దానితో అభివృద్ధి దేవుడికి ఎరుక, విపత్కర పరిస్థితులు దాపరించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఇంకా స్పష్టంగా అర్ధం అయ్యేలా చెప్పాలంటే, ఆఫ్ఘన్ లాంటి పరిస్థితులు వస్తాయి. దానికోసమే దాయాది శత్రు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వాళ్ళు దేశద్రోహులను అడ్డుపెట్టుకొని తమ పని కనిచేసుకుంటున్నారు. అందుకే జాగర్తగా ఉండాలి, ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ప్రమాదాన్ని పక్కకు నెట్టేసి, అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని, దేశాన్ని ముందుకు తీసుకోని వెళ్ళాలి. అది మన తరం అనుభవించకపోయినా తరువాత తరాలు(అందులో మనవాళ్ళు ఉంటారు) అనుభవిస్తారు. ఒకనాడు ఇలా విశాలంగా ఆలోచించారు కాబట్టే స్వాతంత్ర పోరాటం చేయగలిగారు నాటి స్వాతంత్ర సమరయోధులు. మళ్ళీ అంత గౌరవం పొందగలిగే అవకాశం ఈ తరానికి వచ్చింది.
మరింత సమాచారం తెలుసుకోండి: