జగన్ వేవ్....ఇదే వైసీపీకి ఉన్న అతి పెద్ద ప్లస్. అదే గత ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయాన్ని తీసుకురావడానికి కారణం...ఇప్పటికీ వైసీపీ స్ట్రాంగ్‌గా నిలబడటానికి కూడా కారణం. అయితే గత ఎన్నికల్లో ఉన్న జగన్ వేవ్....ఇప్పుడు కాస్త తగ్గిందనే చెప్పాలి...పూర్తి స్థాయిలో కాకపోయినా..కొంతమేర తగ్గింది...ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అంటే జగన్ పాలన ఎలా ఉంటుందో చూడాలని చెప్పి...జనం గత ఎన్నికల్లో వైసీపీ వైపు మొగ్గు చూపారు.

ఇక ఇప్పుడు జగన్ పాలనని ప్రజలు చూస్తున్నారు..అయితే గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసినవారిలో మెజారిటీ ప్రజలు పాలన పట్ల సంతృప్తిగా ఉంటే...కొందరు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారని చెప్పొచ్చు. అదే సమయంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఈ పరిస్తితులని బేరీజు వేసుకుంటే...ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ వేవ్ కాస్త తగ్గిందనే చెప్పొచ్చు...అలాగే మిగిలిన రెండున్నర ఏళ్లలో అది మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గత ఎన్నికల మాదిరిగా...నెక్స్ట్ ఎన్నికలు ఉండవని చెప్పొచ్చు.

అప్పుడు అన్నీ జిల్లాల్లో జగన్ వేవ్ వర్కౌట్ కాకపోవచ్చు...ముఖ్యంగా గతంలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసిన విజయనగరంలో ఈ సారి సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. ఇప్పుడున్న పరిస్తితులని బట్టి చూస్తే...విజయనగరంలో ఈ సారి వైసీపీకి క్లీన్ స్వీప్ చేసే అవకాశమే లేదనే చెప్పాలి. జిల్లాలో అన్నీ సీట్లని వైసీపీ గెలుచుకోవడం అసాధ్యమే. ఎందుకంటే ఇప్పుడు జిల్లాలో మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.

వీరిలో సగం మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేలు ప్రజలకు అండగా ఉండటంలో కూడా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. పైగా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ సైతం బాగా పికప్ అయింది. అసలు కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి ఢీ అంటే ఢీ అనే పరిస్తితి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీకి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఏ మాత్రం లేదనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: