తాజాఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత సీమాంధ్ర ఓట్లు ప్రత్యేకించి కమ్మోరి ఓట్లలో బాగా చీలికవచ్చినట్లు స్పష్టమైంది. ఒకపార్టీకి గంపగుత్తగా వేయకుండా ఎవరికిష్టం వచ్చినట్లుగా ఓటర్లు వాళ్ళు వేసుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మిశ్రమఫలితాలు రావటానికి ఇదే ప్రధాన కారణమనే చర్చ పెరిగిపోతోంది. పోటీనుండి తప్పుకుని నేతలు, క్యాడర్ అంతా కాంగ్రెస్ విజయానికి కష్టపడాలని టీడీపీ నేతలకు పై నుండి ఆదేశాలు వచ్చింది వాస్తవం. అధికారికంగా కాంగ్రెస్ కు మద్దతు పలికితే ఎటునుండి ఏ సమస్య వస్తుందో అన్న భయంతో చంద్రబాబునాయుడు అలాంటి పిలుపివ్వలేదు.





కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రచారంలో టీడీపీ నేతలు, క్యాడర్ పాల్గొన్నది వాస్తవం. అలాగే కాంగ్రెస్ అభ్యర్ధులు, నేతలకు సంబంధంలేకుండా అచ్చంగా టీడీపీ నేతలు, క్యాడరే కాంగ్రెస్ కు మద్దతుగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించింది కూడా నిజమే, ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీపరంగా టీడీపీ మద్దతు ఎక్కువగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బాగా కనబడింది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు ఏపీతో చాలా దగ్గరి సంబంధాలున్నాయి. అలాగే నల్గొండ జిల్లాలోని కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్ నగర్లో కాంగ్రెస్ కు ఓట్లు పడ్డాయి.





ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పరేషన్ పరిధిలో తీసుకుంటే ఇక్కడ పార్టీతో సంబంధంలేకుండా సీమాంధ్ర ఓటర్లు తమిష్టం వచ్చినట్లు వాళ్ళు ఓటింగ్ చేశారు. అందుకనే సీమాంధ్రలు ప్రత్యేకించి కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కుత్బాల్లాపూర్, మల్కాజ్ గిరి, ఎల్బీనగర్, సనత్ నగర్, మేడ్చల్, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది.





అంటే రకరకాల కాంబినేషన్లు చూసుకుని ఓటర్లు తమిష్టం వచ్చినట్లుగా ఓట్లు వేసుకున్నారని అర్ధమవుతోంది. హోలుమొత్తం మీద చూస్తే బాగా నష్టపోయిన పార్టీ ఏదన్నా ఉందంటే అది జనసేన మాత్రమే. పోటీచేసిన ఎనిమిది నియోజకవర్గాల్లో ఎక్కడా కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. ఇటు సీమాంధ్రులు వేయలేదు అటు టీడీపీ మద్దతుదారులూ వేయలేదు. అందుకనే జనసేన చివరకు ఎటూకాకుండా అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: