ఒకప్పుడు పట్టణాలుగా ఉన్నవి ఇప్పుడు నగరాలుగా మారిపోయాయి.  నగరాలు మహానగరాలుగా మారిపోతున్నాయి.  జనాభా పెరుగుతుండటంతో.. దానికి తగ్గట్టుగా రవాణా సౌకర్యాలు పెరుగుతున్నాయి.  మహానగరాల్లో ప్రయాణాల కోసం మెట్రోలను ఉపయోగిస్తున్నారు.  హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రారంభమయ్యాక లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు.  త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలి అనుకునే వాళ్ళు మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు.  


అంతేకాదు, మెట్రోను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచేందుకు ఒక యూనిట్ పనిచేస్తుంటుంది.  ఇలా హ్యాపీగా సాగే మెట్రో ప్రయాణంలోకి అనుకోకుండా ఓ పాము వచ్చి అలజడి సృష్టించింది.  ఈనెల 14 వ తేదీన డిబి 31 అనే నెంబర్ కలిగిన ట్రైన్ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ కు బయలుదేరింది.  రైలు దిల్ షుక్ నగర్ చేరుకోగానే ఫైలట్ డ్యాష్ బోర్డు లో పాము కనిపించింది.  దీంతో ఫైలట్ షాక్ అయ్యాడు.  వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులకు కాల్ చేశారు.  


అయితే వాళ్ళు వచ్చే సరికి పాము మాయం అయ్యింది.  ఫైలట్ క్యాబిన్ మొత్తం వెతికారు.  ట్రైన్ మొత్తం గాలించారు.  దొరకలేదు.  వెళ్లిపోయిందేమో అనుకోని ట్రైన్ తిరిగి వెళ్ళిపోయింది.  అప్పటి నుంచి ఆరు రోజులు, 80 ట్రిప్పులు, 2500 కిలోమీటర్లు.. రైట్లు ప్రయాణం చేసింది.  ఆగష్టు 19 వ తేదీన మరలా అదే పాము పైలట్ కేబిన్ లో కనిపించింది. 


ట్రైనును దిల్ షుక్ నగర్ నుంచి ఎల్బీ నగర్ కు తీసుకెళ్లి స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు.  హుటాహుటిన స్నేక్ సొసైటీ సభ్యులు వచ్చి పామును పట్టుకున్నారు. అయితే, ఆ పాము ఏమి చేయదని, ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి.. దాన్ని అడవిలో వదిలిపెట్టారు. తెలియకుండానే పాముతో కలిసి 6 రోజుల పాటు ప్రయాణం చేయడంతో ప్రయాణికులు షాక్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మెట్రో అధికారులకు విజ్ఞప్తి చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: