ఆసియా కప్ 2018 లో భాగంగా దాయాదుల పోరులో ఇండియా విజయ భేరి మోగించింది. మొదటి నుండి హాట్ ఫేవరేట్ గా రంగంలో దిగిన ఇండియా లీగ్ దశలో రెండో మ్యాచ్ గా పాకిస్తాన్ తో తలపడింది. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భువనేశ్వర్, కేదర్ జాధవ్ చెరో 3 వికెట్లు తీయగా.. బూమ్రా 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్ తీయగా 43.1 ఓవర్లకే పాకిస్తాన్ 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది.


ఇక తక్కువ టార్గెట్ ఛేజ్ చేసేందుకు రంగంలో దిగిన టీం ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ 52, శిఖర్ ధావన్ 46 పరుగులు చేసి అవుట్ అవగా.. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు 31, దినేష్ కార్తిక్ 31 పరుగులతో మ్యాచ్ విన్ చేశారు. కేవలం 29 ఓవర్లకే 164 పరుగులు చేసి 2 వికెట్లను కోల్పోయింది ఇండియా.


హాంగ్ కాంగ్ తో టఫ్ ఫైట్ ఎదుర్కున్న ఇండియా టఫ్ ఫైట్ జరుగుతుంది అని భావించిన ఇండియా పాక్ మ్యాచ్ ను చాలా తేలికగా విజయం సాధించారు. దాయాదుల పోరులో టీం ఇండియా విజయాన్ని అందరు ఆస్వాదిస్తున్నారు. గ్రూప్ ఏ నుండి 2 మ్యాచ్ లను ఆడిన ఇండియా పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.