
ముఖ్యంగా డేవిడ్ వార్నర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్లాట్ కమిన్స్, క్వింటన్ డీ-కాక్, శిఖర్ ధావన్, ఫాఫ్ డూప్లెసిస్, శ్రేయాస్ అయ్యర్, కగిసో రబాడ, మహ్మద్ షమీ ఈ మార్క్యూ సెట్‌లో భాగంగా ఉన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు 10 చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, టీమ్ అహ్మదాబాద్ ఐపీఎల్‌లో వేలంవేయనున్నాయి.
ఫాఫ్ డుప్లెసిస్, డేవిడ్ వార్నర్, ఫాట్ కమిన్స్, కగిసో రబడ, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, జానీ బెయిర్ స్టో, జాసన్ హోల్డర్, డ్వేన్ బ్రావో, షకీబ్ అల్ హాసన్, వనిందు హసరంగా తో పాటు ఇంగ్లాండ్ ఫేసర్ వేలంలోకి ప్రవేశించారు. కేవలం రూ.2కోట్లు అత్యధిక రిజర్వ్ ధర 48 ఆటగాళ్లు తమను తాము ఈ బ్రాకెట్‌లో ఉంచుకోవడానికి ఎంచుకున్నారు. 1.5 కోట్ల రిజర్వ్ ధరతో 20 మంది ఆటగాళ్లు వేలం జాబితాలో ఉండగా.. 34 మంది ఆటగాళ్లు రూ.1కోటి రిజర్వ్ ధరతో ఐపీఎల్ వేలంలో ఉన్నారు. అయితే ఈసారి ఐపీఎల్ వేలంలో ఎవరు అధిక ధర పలుకుతారో తెలియాలని కొద్ది రోజులు వేచి చూడాలి.