ఇక ఇలా ఎవరైనా బ్యాట్స్మెన్లు వార్ వన్ సైడ్ అన్న విధంగానే బ్యాటింగ్ చేశారు అంటే చాలు ఇక అంతర్జాతీయ క్రికెట్లో అతని పేరు మారుమోగిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మెరుపు సెంచరీ తో ఒక ఆటగాడు ఇలాగే వార్తల్లో నిలిచాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ అండగా నిలబడ్డాడు. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి వీరవిహారం చేశాడు అని చెప్పాలి. అతని వికెట్ పడగొట్టాలని బౌలర్లు శతవిధాలా ప్రయత్నించిన.. చివరికి అతనే పైచేయి సాధించాడు. అతను ఎవరో కాదు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ క్లాసన్.
సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో భాగంగా ఇక ఇలా అద్భుతమైన ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. 261 పరుగుల లక్ష్యంతో సౌత్ ఆఫ్రికా జట్టు బరిలోకి దిగింది. ఇలాంటి సమయంలో ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విభాగం పేక మెడల కూలిపోయింది. 87 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఓటమి తప్పదు అనుకున్న దశలో క్రీజులోకి వచ్చిన క్లాసన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 61 బంతుల్లో ఐదు సిక్సర్లు 15 ఫోర్ లతో 119 పరుగులు చేశాడు. దీంతో 29.3 ఓవర్లలోనే సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. కాగా క్లాసన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడుతుండటంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు.