ప్రస్తుతం టీమిండియా ఎంతో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా తో తలబడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మహా సంగ్రామానికి ఇంగ్లాండ్లోని ఓవల్ మైదానం ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలిచి విశ్వ విజేతగా టైటిల్ అందుకుంటారు అనే విషయం పైన గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇక మ్యాచ్ ప్రారంభమైన తర్వాత మాత్రం అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. ఎందుకంటే టీమిండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసి  ఫైనల్ మ్యాచ్లో అడుగు పెట్టింది టీమిండియా.


 ఈ క్రమంలోనే ఈసారి తప్పకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్లో గెలిచి తీరుతుందని అందరూ బలంగా నమ్మారు. కానీ ఊహించిన రీతిలో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతుంటే.. టీమ్ ఇండియా మాత్రం ఓవల్ మైదానంలో పరుగులు రాబట్టడానికి విలవిలలాడిపోతుంది అని చెప్పాలి. టాప్ ఆర్డర్  బ్యాట్స్మెన్లు అందరూ కూడా తక్కువ పరుగులకే చేతులెత్తేస్తూ ఉండడంతో.. ఇక టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇక ఆస్ట్రేలియా 296 పరుగుల ఆదిక్యంలో ఉంది అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవలే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ తక్కువ పరుగులకే  వికెట్ కోల్పోయిన సమయంలో టీమిండియ ఆల్ రౌండర్ శార్తుల్ ఠాగూర్ మాత్రం మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ఏకంగా హాఫ్ సెంచరీ చేసి ఇక జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలకపాత్ర వహించాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఓవల్ మైదానంలో వరసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన విదేశీ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. ఈ లిస్టులో డాన్ బ్రాడ్మన్, అలెన్ బోర్డర్ మాత్రమే ఉన్నారూ. అంతేకాదు ఓవల్ మైదానంలో మూడు అర్థ సెంచరీలు చేసిన తొలి ఇండియన్ బ్యాట్స్మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc