న్యూజిలాండ్‌ టూర్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాఱ్ కోహ్లీ కెరీర్‌లో ఒక పీడ‌క‌ల‌గా మిగిపోయింది. భారత్ న్యూజిలాండ్ మధ్య సుదీర్ఘమైన ద్వైపాక్షిక సిరీస్ ముగిసింది. ఐదు టీ20 సిరీస్‌ను 5-0తో విజయం సాధించిన టీమిండియా.. తర్వాత వన్డే సిరీస్ 3-0తో, టెస్టు సిరీస్ 2-0తో ఓడిపోయింది. న్యూజిలాండ్‌ పర్యటనలో కెప్టెన్ కోహ్లీ అయితే వ్యక్తిగతంగా ఘోరంగా విఫలమైయ్యాడు. మూడు ఫార్మాట్లలో కో‍హ్లీ 218 పరుగులే చేశాడు.

 

IHG

 

పలు సీనియర్ ప్లేయర్ల గైర్హాజరీలో వన్డే మరియు టెస్టులు ఆడిన కొహ్లీ సేనకు రేంజులో చిత్తవడం మాత్రం తీవ్రమైన నిరాశ కలిగించే విషయమే. టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ రిపోర్టర్లపై చిందులేశాడు. ప్రశ్నల సెషన్లో జర్నలిస్ట్ మైదానంలో కోహ్లీ అసభ్యకర ప్రవర్తనను ప్రస్తావించాడు. దీనితో కోహ్లీ రిపోర్టర్ల పై రెచ్చిపోయాడు.

 

న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కెప్టెన్ విలియమ్స్ ప్రేక్షకులను పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించారు…. ఇండియా కెప్టెన్ గా మీరు ఇలా చేసి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు అని రిపోర్టర్ ప్రశ్నించగా.. అన్ని తెలుసుకొని మాట్లాడాలని ఏదీ తెలియకుండా ప్రశ్నలతో విసిగించవద్దని గ్రౌండ్ లో జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలుసుకొని వచ్చి మాట్లాడాలని హితవు పలికాడు. ఇప్పటికే మ్యాచ్ రిఫరీకి సంజాయిషీ ఇచ్చానని కోహ్లీ తెలిపారు. సంఘటనను ఆధారం చేసుకుని వివాదం సృష్టించే ప్రయత్నం చేయవద్దని హితవు పలికాడు. అలా తన ఎమోషన్స్ ను తప్పుగా నిందించడం కోహ్లీ అందరి ముందు అవమానంగా భావించాడు.

 

IHG

 

కోహ్లీ బాగా ఆడి ఉంటే జర్నలిస్టు అతనిని పశ్న అడిగే ధైర్యం చేసేవాడా...? నెంబర్1 హోదాలో ఉన్న జట్టు యొక్క కెప్టెన్ తన టీమ్ లోని లోపాలను చక్కదిద్దాల్సింది పోయి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను దూషించడం చాలా మంది భారత అభిమానులకు కూడా నచ్చలేదు. విలేఖరి అడిగిన ప్రశ్న కొంచెం తప్పుగా ఉన్నా కోహ్లీ ఫీల్డ్ లో కొంత కంట్రోల్ లో ఉంటే బాగుండేదని పలువురి మాట. ఇకనైనా 'కింగ్' కోహ్లీ ఓటమి బాధను వెనకేసి పూర్వంలా రెచ్చిపోవాని సగటు భారత అభిమాని కోరిక.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: