ఐపీఎల్ లో కొన్ని జట్లు  అంచనాలకు తగ్గట్లుగా ఆడకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలా మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగినప్పటికీ వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొన్న జట్టు కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ చరిత్రలో దిగ్గజా జట్లలో  కోల్కతా నైట్రైడర్స్ జట్టు కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రేక్షకులందరిలో  పటిష్ఠమైన జట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పై నమ్మకం కలిగింది. కానీ ఈ ఏడాది మాత్రం అంచనాలకు తగ్గట్లుగా ప్రదర్శన చేయడం లేదు కోల్కతా నైట్రైడర్స్ జట్టు . పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగించి.



 కెప్టెన్సీ లోపం వల్లే కోల్కతా నైట్రైడర్స్ జట్టు బాగా రాణించడం లేదు అని అందరూ అనుకున్నారు. దినేష్ కార్తీక్  కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకొని జట్టులో ఉన్న ఇయాన్ మోర్గాన్ కీ  కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్స్ కూడా ఎన్నో తెరమీదకు వచ్చాయి. అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా దినేష్ కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతలను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వెంటనే కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బాధ్యతలు చేపట్టాడు. సారథ్య బాధ్యతలు ఇయాన్ మోర్గాన్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుంది అని అనుకున్నారు.



 కానీ జట్టు  పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా మార్పు లేదు. ఇక ఇయాన్ మోర్గాన్ చేతుల్లోకి కెప్టెన్సీ బాధ్యతలు వచ్చిన తర్వాత కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు మరింత  పేలవ  ప్రదర్శన చేస్తోంది అని చెప్పాలి. కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ మార్చినప్పటికి కూడా ఆట తీరు మాత్రం మారలేదు. ఇయాన్ మోర్గాన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు ఏకంగా ఆరు మ్యాచ్ లు ఆడింది. ఆరింట్లో రెండు  మాత్రమే విజయం సాధించి  నాలుగింటిలో ఘోర ఓటమి చవిచూసింది. కొన్ని కొన్ని మ్యాచ్ ల్లో అయితే కనీసం స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా చేయలేకపోయింది కోల్కతా నైట్రైడర్స్ జట్టు. దీంతో జట్టుకి కెప్టెన్ మారినప్పటికీ ఆటగాళ్ల ప్రదర్శన సరిగా లేకపోతే ఇక ప్రయోజనం ఏమిటి అని అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: