మొన్నటికి మొన్న వెన్నునొప్పి గాయం కారణం గా జట్టుకు కొన్నాళ్ల పాటు దూరమైన బుమ్రా మళ్ళీ టీమిండియా జట్టుతో చేరి పోయాడు అన్న విషయం తెలిసిందే. బుమ్రా రాకతో టీమిండియా బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా మారి పోయింది అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా జట్టు లోకి వచ్చిన బుమ్రా మరోసారి తనదైన విషయాలు బాగా రాణించడం తో ఇక టి20 ప్రపంచ కప్ లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తుంది అని భావించారు.


 ఈ క్రమంలోనే ఇటీవలే మళ్లీ గాయం తిరగబడటంతో బుమ్రా  టీం ఇండియాకు దూరం అయ్యాడు అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. బుమ్రా లాంటి బౌలర్ లేకుండా టీమిండియా కు టీ20 వరల్డ్ కప్ లో కష్టమే అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జట్టుకు దూరమైన నేపద్యంలో అతని స్థానంలో హైదరాబాది ఫేసర్ మహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేశారు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి. అతనికి తుదిచెట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న విషయంపై చర్చ జరుగుతున్న సమయంలో ఇటీవలే మహమ్మద్ సిరాజ్ ను బుమ్రా స్థానంలో ఎంపిక చేయడం విషయంలో బిసిసిఐ నిర్ణయం మార్చుకుంది అంటూ టాక్ వినిపిస్తోంది. సన్రైజర్స్ జట్టు తరుపున ఆడి స్పీడ్ గన్ గా పేరు సంపాదించుకున్న ఉమ్రాన్ మాలిక్ ను బుమ్రా స్థానంలో పిలిపించిందట బీసీసీఐ. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్ కోసం మహమ్మద్ సిరాజ్ తో కలిసి ఉమ్రాన్ మాలిక్ కూడా ఫ్లైట్ ఎక్కబోతున్నాడట. అయితే బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆ లోటును భర్తీ చేయడానికి వీరిద్దరిని పిలిచినట్లు టాక్ వినిపిస్తుంది. మరి బుమ్రా స్థానంలో తుదిజట్టిలో ఎవరు చోటు దక్కించుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: