
భారత మాజీ క్రికెటర్లు అయిన గౌతమ్ గంభీర్ శ్రీశాంత్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం.. ఏకంగా ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటారేమో అన్న విధంగా మారిపోయింది అని చెప్పాలి. మైదానంలో.. ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు దారుణంగా దూషించుకున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ పూర్తయిన తర్వాత మాజీ ప్లేయర్ శ్రీశాంత్ గౌతమ్ గంభీర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ఏకంగా గంభీర్ తనను ఫిక్సర్ అంటూ ఎన్నోసార్లు అన్నాడని.. అతను ఏమైనా సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతేకాదు గంభీర్ తనని తిట్టిన వీడియోని కూడా శ్రీశాంత్ సోషల్ మీడియాలో పెట్టడం ఆ టాపిక్ గా మారిపోయింది.
అయితే ఇటీవల ఈ విషయంపై స్పందించిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు.. ఇక శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు పంపించారు అన్నది తెలుస్తోంది. శ్రీశాంత్ తమ కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించాడు అంటూ ఈ నోటీసులలో పేర్కొన్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను తొలగించిన తర్వాతే.. అతనితో చర్చలు జరపడం గురించి ఆలోచిస్తాము అంటూ చెప్పుకొచ్చారూ. ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.