ప్రస్తుతం ఈ టీవీ కాస్త రేటింగ్ విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నది. అయితే ఈటీవీ టాప్ రేటింగ్ లో ఉండటానికి ముఖ్య కారణం జబర్దస్త్ మరియు ఢీ షో వంటివి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు బాలసుబ్రమణ్యం గారి ఆధ్వర్యంలో నడిచిన పాడుతా తీయగా వంటి షోలను ఇప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఢీ డాన్స్ షో కూడా ఒకప్పుడు బాగా చూసేవారు ముఖ్యంగా సుదీర్, రష్మీ ఉన్న సమయంలో బాగా రిపీట్ చేస్తూ చూసేవారు. కానీ ఢీ డాన్స్ షో నుండి వారు తప్పుకోవడంతో ఈ సీజన్ కి దారుణమైన రేటింగ్ నమోదైనట్లు సమాచారం.

ఢీ డాన్స్ షో ను ఇప్పటికి కూడా డాన్స్ మీద ఎంతో ఆసక్తి ఉన్నవారు చూస్తూనే ఉంటారు. ఈ సమయంలో ఒక గట్టి పోటీ ఇచ్చేందుకు ఆహా సిద్ధమైనట్లుగా సమాచారం. ఢీ కి ఏ మాత్రం తగ్గకుండా ప్రముఖ యాంకర్ ఆధ్వర్యంలో ఆహా వారు డాన్సులూ నిర్వహించబోతున్నట్లూ టాక్ వినిపిస్తోంది. ఇటీవలె తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. అందుచేతనే ఇప్పుడు డాన్స్ షో నిర్వహించేందుకు పలు ఏర్పాట్లు చేస్తున్నారని ఆహా వర్గాల నుంచి సమాచారం అందుతుంది.


ఇందుకోసం ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినా శేఖర్ మాస్టర్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈయనతో పాటు మరికొందరు జడ్జీలుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆహా సంస్థ వారు ఢీ షో ని మొదలు పెడితే ఖచ్చితంగా మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆ షో కి సంబంధించి పలు చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. స్వయంగా ఆహా వారే దీనిని నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరొకవైపు ఉత్తరాది డాన్స్ కాంపిటీషన్స్ హక్కులు కూడా కొనుగోలు చేయడం వల్ల దానిని ఇక్కడ నిర్వహించేలా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఏదిఏమైనా ఈ ఏడాది చివరకు మాత్రం బాలయ్య అన్ స్టాపబుల్ , డ్యాన్స్ షోలను నిర్వహించేందుకు ఆహ సిద్ధమవుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: