అతి తక్కువ సమయంలో మంచి టాక్ ను అందుకున్న సినిమాలలో ఒకటి పోకో..ఈ కంపెనీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.తాజాగా మరో ఫోన్ ను విడుదల చేసారు..పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ కే40 గేమ్ ఎన్‌హేన్స్‌డ్ ఎడిషన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ ఇప్పుడు యూఎస్ రిటైలర్ వెబ్ సైట్లో కూడా కనిపించింది.


ఈ లిస్టింగ్ ప్రకారం ఇందులో 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. ఈ ఫోన్ మనదేశంలో రూ.25 వేల రేంజ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. స్క్రీన్ రిఫ్రెట్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 480 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుందని సమాచారం. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌పై పోకో ఎఫ్3 జీటీ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందించనున్నారు.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5065 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 67W ఫాస్ట్ చార్జింగ్‌ ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో ఐపీ53 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నాయి. 5జీ, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు కూడా ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి.. ఈ ఫోన్ బరువు కూడా  205గ్రాములు ఉంది..మార్కెట్ వీటికి డిమాండ్ కూడా భారీగా పెరిగింది..

మరింత సమాచారం తెలుసుకోండి: