ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. పేద, ధనిక  అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. పొద్దునే లేవగానే ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ చేసిన తర్వాతే వారి దినచర్యను మొదలు పెడుతున్నారు.


మెటాకు చెందిన వాట్సాప్ కూడా కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ దూకుడు మీద ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, డిజైన్ లో మార్పులు చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా యూజన్ నేమ్ సెర్చ్ ఫీచర్పై పనిచేస్తోంది. ఫోన్ నంబర్లకు బదులు యూజర్ నేమ్ ను షేర్ చేసుకునేందుకు ఈ ఫీచర్ కల్పించనుంది. ప్రస్తుతానికి డెవలమ్ మెంట్ స్టేజ్ లో ఉంది. ఎంపిక చేసిన యూజర్లకు మాత్రం అందుబాటులో ఉంది.


ప్రస్తుతం మనం ఎవరితో అయినా వాట్సాప్ లో చాట్ చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరి. కొందరికీ వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వడం ఇష్టం ఉండదు. తప్పనిసరి పరస్థితుల్లో ఫోన్ నంబర్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇకపై యూజర్లు ఫోన్ నంబర్లకు బదులు యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సెర్చ్ బార్ లో సంబంధిత యూజర్ నేమ్ ఎంటర్ చేస్తే యూజర్ తో కనెక్ట్ కావొచ్చు. ఫొన్ నంబర్ పంచుకోవడం ఇష్టం లేని వ్యక్తులు ఈ యూజర్ ని షేర్ చేసుకోవచ్చు.


మరోవైపు ఎంపిక చేసిన చాట్స్ కు లాక్ వేసుకొనే సదుపాయాన్ని మెటా తీసుకువచ్చింది. ఇప్పుడు కొత్తగా సీక్రెట్ కోడ్ సదుపాయాన్ని దానికి జోడించింది. ఈ ఫీచర్ ద్వారా చాట్ లాక్ కోసం ప్రత్యేకంగా సీక్రెట్ కోడ్ పెట్టుకోవచ్చు. అంటే ఆయా చాట్స్ ఓపెన్ చేయాలంటే ఈ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయడం తప్పనిసరి. అంకెలు, అక్షరాలు, ఎమెజీలు కోడ్ గా పెట్టుకోవచ్చు. ఈ కోడ్ ను సెర్చ్ బార్ లో ఎంటర్ చేసినప్పుడు మాత్రమే లాక్ చేసి ఉంచిన చాట్స్ కనిపిస్తాయి. ఇతర వ్యక్తులు మన ఫోన్ లాక్ ఓపెన్ చేసి వాట్సాప్ చూసినా లాక్ చేసిన చాట్ ను మాత్రం చూడలేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: