
ఓలా ఎలక్ట్రిక్ ఎండ్ ఐస్ ఏజ్ మిషన్ లో భాగంగా డిసెంబర్ టూ రిమెంబర్ పేరుతో ఒక క్యాంపు ని సైతం ప్రారంభించబోతోంది. ఈనెల మూడవ తేదీ నుంచి ఆల్రెడీ ఇందుకు సంబంధించి క్యాంప్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇందులో ola S1X+ EV బైకు పైన భారీ డిస్కౌంట్ సైతం ప్రకటించింది. ఏకంగా 20 వేల రూపాయల తగ్గింపుని సైతం ప్రకటించింది. ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి ఈ బైక్ చాలా బెటర్ అని చెప్పవచ్చు.
డిసెంబర్ 31 వ తేదీ లోపు కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందట.. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర విషయానికి వస్తే.. రూ.1,09,999 రూపాయలు కాక ప్రస్తుతం 20000 తగ్గడంతో ఈ బైక్ 89,999 రూపాయలకు వచ్చింది. దీంతోపాటు పలు రకాల EMI ఆప్షన్లతో కూడా ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డుల పైన మరో 5000 సైతం బెనిఫిట్ ని పొందవచ్చు.
ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే..3KWH కెపాసిటీ బ్యాటరీ కలదు ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించవచ్చట.. ఏడు గంటలలో చార్జింగ్ పూర్తి చేసుకోవచ్చట..3.3 సెకండ్లలోని గంటకు జీరో నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ఇందులో 5 అంగుళాల ఎల్ఈడి డిస్ప్లే తోపాటు ఎల్ఈడి లైట్స్ రివర్స్ మోడ్ నావిగేషన్ తదితర ఫీచర్స్ కలవు.