అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ( మార్చ్ 8) పురస్కరించుకొని , ఈ సందర్భంగా  ఏపీ ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి 10% రాయితీ ఇస్తుందట. ఈ ఆఫర్ కేవలం మహిళలకు మాత్రమే. మహిళా దినోత్సవం సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే దీక్షా యాప్ ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ 2000 స్టాండ్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారట.


అంతేకాకుండా దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకునేవారికి ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో మహిళా దినోత్సవం రోజున మొబైల్ ఫోన్ లు కొనుగోలు చేసిన మహిళలకు 10% రాయితీ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఇక మహిళా భద్రత, సాధికారిత పై షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. అంతే కాకుండా మహిళల కోసం ఇప్పటికే అమ్మఒడి చేయూత పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, మరొక కొత్త స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని కూడా మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.


ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ యాప్ ను ఉపయోగించి రిపోర్ట్ చేసిన వెంటనే 799 ఘటనలో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 154 ఎఫ్ఐఆర్ లో రిజిస్ట్రేషన్ చేయాలని వెల్లడించారు. మహిళలు, బాలిక లపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లో చార్జిషీట్ దాఖలు కావాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని,అందుకు దగ్గర లోనే వ్యవస్థను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.

అంతేకాకుండా దిశా కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు పై దృష్టి పెట్టాలని సీఎం జగన్ కోరారు. అలాగే అన్ని పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. మహిళ లకు మరింత భద్రతను కల్పించాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: