ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోయిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని వారికి ఏదైనా అపాయం కలిగితేనే అయ్యో పాపం అంటూ జాలిపడేవారు మనుషులు. ఇక ప్రమాదంలో ఉన్నది ఎవరో అనేది విషయం కూడా తెలియకపోయినా ఇక వారికి సహాయం చేసేందుకు ముందడుగు వేసేవారు. కానీ ఇటీవల కాలంలో సహాయం చేయడం గురించి దేవుడు ఎరుగు ఏకంగా సాటి మనుషుల విషయంలో ఎంతో కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే మానవత్వాన్ని మరిచిపోయి ఇక విచక్షణ కోల్పోతున్న మనుషులు ఏకంగా ఉన్మాదంతో దారుణ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.


 కేవలం సాటి మనుషుల విషయంలోనే కాదు అటు మూగజీవాల విషయంలో కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు మనుషులు. అభం శుభం తెలియని మూగజీవాల ప్రాణాలు తీసేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. రోడ్డుపై పోతుంటే తమను చూసి మొరిగింది అన్న కారణంతో ఓ శునకంపై దారుణానికి తెగబడ్డారు ఇద్దరు యువకులు. దాని మెడకు ఉన్నా చైన్తో ముందు కాళ్ళని కట్టేసి పెద్ద కర్రలతో విచక్షణ రహితంగా చితకబాదారు.. దీంతో బాధతో ఆ కుక్క మూలుగుతున్న చుట్టుపక్కల వారు వీరిని ఆపేందుకు ప్రయత్నించిన ఈ మూర్ఖులు మాత్రం వెనక్కి తగ్గలేదు.


 ఇంతలో ఆ శునకానికి సంబంధించిన ఓనర్ అక్కడికి చేరుకొని నిలదీయడంతో ఇక ఆ ఇద్దరు యువకులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు అని చెప్పాలి. ఈ ఘటన ఈస్ట్ బెంగళూరు కె ఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ లేఅవుట్లో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు శునకాన్ని యజమాని వెటర్నిటీ హాస్పిటల్లో చేర్పించినట్లు తెలుస్తుంది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి దర్యాప్తు చేపట్టారు.  అయితే ఇలా మూగజీవాలపై దారుణంగా దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ స్థానికులు కూడా డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి: