ఇక చాలా మంది పెంపుడు జంతువులను వారి యజమానులు వారి సొంత మనుషులతో సమానంగా చూసుకుంటారు. ఇక తమ కుక్కలకు కూడా పుట్టిన రోజులు ఇంకా పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. కొంతమంది అయితే పెంపుడు కుక్కలకు వింతగా సీమంతం కూడా చేస్తూ ఉంటారు.ఇక అలాంటి ఓ వింత ధోరణినికి సంబంధించిన సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలీగఢ్‌లో ప్రస్తుతం వెలుగు చూసింది. ఎంతో సాంప్రదాయబద్ధంగా తన పెంపుడు కుక్కలకు పెళ్లి జరిపించాడు ఓ యజమాని. మనుషుల పెళ్లి కోసం అమ్మాయి ఇంకా అబ్బాయిని వెతికినట్టుగానే..ఇక్కడ కూడా వేరువేరు ప్రాంతాలకు చెందిన రెండు కుక్కలకు వివాహం చేశారు వాటి యజమానులు.అక్కడ ఆచార సంప్రాదాయల ప్రకారం వాటికి పెళ్లి చేశారు. ఏడు నెలల ఆడ కుక్క జెల్లీకి టామీకి వేడుకగా పెళ్లి చేశారు.ఈ టామీ అనేది సుఖ్రావలి గ్రామస్తుడైన దినేష్ చౌదరి పెంపుడు కుక్క.ఇక జెల్లీ వచ్చేసి టిక్రీ రాయ్‌పూర్‌కు నివాసి అయిన డాక్టర్ రాంప్రకాష్ సింగ్‌కు చెందిన పెంపుడు కుక్క. 


సంక్రాంతి పండుగ రోజున అనగా జనవరి 14న టామీ, జెల్లీల వివాహంని నిశ్చయించారు. ఇలా అలీఘర్‌లోని సుఖ్రవలీకి చెందిన దినేష్‌ చౌదరికి చెందిన టామీ (మగ కుక్క)కి.. టిక్రీ రాయ్‌పూర్‌కు చెందిన రాంప్రకాశ్‌ సింగ్‌కు చెందిన శునకం జెల్లీ (ఆడకుక్క)కి జనవరి 14వ తేదీన పెళ్లిని చేశారు. బాజా భజంత్రీలు ఇంకా డీజే చప్పుళ్ల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో చాలా ఘనంగా వివాహం జరిపించారు.ఇక వీరి పెంపుడు కుక్కల పెళ్లికి బంధుమిత్రులు ఇంకా అలాగే స్థానికులు చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డీజే చప్పుళ్లతో బరాత్‌ తీస్తూ ఇంకా డ్యాన్స్ చేస్తూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌గా మారింది.ఈ వైరల్ వీడియోని చూసిన నెటిజన్లు ఇంకా జంతు ప్రేమికులు ఎన్నో ప్రశంసలు అలాగే కామెంట్లు కుమ్మరించారు. ఈ వైరల్ వీడియోని లైక్‌ చేస్తూ ఇంకా షేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో ఇంకా  వైరల్‌గా మార్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: