ప్రెగెన్సీ టైంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో వీటి విషయం లో జాగ్రత్త తీసుకోవడం ఎంతో అవసరం, ఎందుకంటే ఈ టైమ్ లోనే బేబీ ఎదగడం మొదలుపెడుతుంది. రిస్క్స్ కి దారి తీసే, ఇంట్లో మనం వాడే కొన్ని ప్రోడక్ట్స్ రిస్క్ కి దారి తీస్తాయి అవి ఏంటో చూద్దమా.

ప్లాస్టిక్ వాతావరణానికే కాదు, పొట్టలో పెరుగుతున్న మీ బేబీ కి కూడా మంచిది కాదు. ప్లాస్టిక్ లో థాలేట్స్ వంటి కొన్ని డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. ఇవి చర్మం ద్వారా ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. లేదా వీటిని వేడి చేసినప్పుడు కూడా విడుదల అవుతాయి. ఈ కెమికల్స్ కడుపులో ఉన్న బిడ్డకి కాంప్లికేషన్స్ కలుగచేస్తాయనీ, ఆ బిడ్డ రీ ప్రొడక్టివ్ గ్రోత్ ని ఎఫెక్ట్ చేస్తాయనీ తెలుస్తోంది.

ప్రెగ్నెన్సీ టైమ్ లో మేకప్ వాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. లిప్స్టిక్స్, షాంపూస్, టోనర్స్ వంటి వాటి రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ లో కూడా థాలేట్స్ ఉండే అవకాశం ఉంది. ఇవి మీ బేబీ కి హాని కలుగ చేస్తాయి. వారి బరువు మీద ప్రభావం చూపించవచ్చు, మానసికమైన ఎదుగదల ని కూడా ఎఫెక్ట్ చేయవచ్చు. ఎయిర్ పొల్యూషన్ ఇంటి నుండి కాలు బయట పెడితే మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇంటి లోపల కూడా పొల్యూషన్ లెవెల్స్ తక్కువగా ఏమీ లేవు. ఔట్‌డోర్ పొల్యూషన్ ఎంత ప్రమాదకరమో ఇన్‌డోర్ పొల్యూషన్ కూడా అంతే ప్రమాదకరం.

మస్క్విటో రిపెల్లెంట్స్ ఎంతో హ్యాండీ గా ఉంటాయి. దోమల బారి నుండి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాయి. కానీ, ఇవి ప్రెగ్నెన్సీ ఫ్రెండ్లీ మాత్రం కాదు. ఎంత సేఫ్ ప్రోడక్ట్స్ అయినా కూడా కొద్దిగా అయినా డీఈఈటీ, ఇంకా ఇతర కెమికల్స్ అందులో ఉంటాయి. ఇవి స్కిన్ ద్వారా లోపలికి వెళ్ళగలవు. అందుకే గర్భం ధరించిన మొదటి నెలల్లో వీటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే, నాఫ్తలీన్ బాల్స్, ఎసిటోన్, బ్లీచ్ వంటి కామన్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ వల్ల కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ప్రెగ్నెంట్ వుమన్ కి గోడలకి వేసే పెయింట్స్ కూడా హాని చేస్తాయి. పెయింట్స్ లో కామన్ గా ఉండే లెడ్ ఎంతో హానికరమైనవి. ఇది బర్త్ డిఫెక్ట్స్ కీ, నెలలు నిండక ముందే బిడ్డ పుట్టకపోవడానికీ దారి తీస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: