మహిళలు గర్భధారణ సమయంలో ఓటేసి ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా టెస్ట్ చేసుకొని నిర్దారణకి వస్తుంటారు. అయితే ప్రెగ్నెసీ టెస్ట్ ఏ సమయంలో టెస్ట్ చేసుకోవాలో ఒక్కసారి చూద్దామా. అయితే ఈ టెస్ట్ చేసుకోవడానికి సరైన సమయం ఎప్పుడు అనే విషయంలోకి వస్తే.. పీరియడ్ కరక్ట్‌గా రాకుండా ఆలస్యం అయ్యినపుడు టెస్ట్ చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక మీ పీరియడ్ రాని మొదటి రోజు మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే కొన్ని కొన్ని కిట్స్ అయితే పీరియడ్స్‌కి నాలుగు నుండి ఐదు రోజుల ముందే డిటెక్ట్ చేసేస్తాయని తెలిపారు. కాగా.. పీరియడ్ మిస్ అయిన తర్వాత చూసుకోవడం వల్ల కరెక్ట్ రిజల్ట్ వస్తుందని తెలిపారు. దాంతో తప్పు రిజల్ట్ రాకుండా ఉంటుందని తెలిపారు.

అయితే ఒకవేళ కనుక మీకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడం లేదు అంటే అప్పుడు మీరు కచ్చితంగా 35 నుండి 40 రోజులు ఆగాల్సి ఉంటుందని తెలిపారు. ఇక అప్పుడు మాత్రమే కచ్చితమైన రిజల్ట్ వస్తాయని నిపుణులు తెలిపారు. ఇక ఇది ఇలా ఉంటే స్టడీస్ ప్రకారం..  ఉదయాన్నే టెస్ట్ చేసుకుంటే మంచిదని దీని వల్ల సరైన రిజల్ట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాగా.. దీనికి గల కారణం ఏమిటంటే..? అప్పుడు యూరిన్ ఎక్కువ కాన్సంట్రేట్‌గా ఉంటుందని దీని కారణంగా HCG కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

అంతేకాక.. మీ పీరియడ్స్ ఆలస్యంగా వచ్చినప్పుడు టెస్ట్ చేసుకుంటే ఇది మరింత దృఢంగా ఉంటుందని తప్పు రిజల్ట్స్ రాకుండా చూసుకోవడానికి వీలవుతుందని తెలిపారు. ఇక ఎప్పుడూ కూడా మీ పీరియడ్ ని బట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అని తెలిపారు. అయితే ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు కంగారు పడకుండా ఆలస్యంగా చెక్ చేసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. కాగా.. మీకు ప్రెగ్నెన్సీ రాకుండా వాడుతుంటే.. మీ పీరియడ్ మిస్ అయినా... ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించిన ఆలస్యం చేయకుండా చెక్ చేసుకోవాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: