ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ 'డుకాటి'  ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో ఓ కొత్త బైక్ లాంచ్ చెసింది.దాని పేరు 'స్ట్రీట్‌ఫైటర్ వి2'. కంపెనీ  ఈ కొత్త బైక్ ధర రూ. 17.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా ఇంకా అలాగే మంచి పనితీరుని కూడా అందిస్తుంది. డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి2 బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది దాదాపు 'స్ట్రీట్‌ఫైటర్ వి4' కి చాలా దగ్గరగా ఉంటుంది. కావున ఈ బైక్  ముందు భాగంలోని ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కూడా దీనికి మరింత ఆకర్షణను అందిస్తుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు. అంతే కాకుండా ఇందులో రేడియేటర్ ష్రడ్స్, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టం, సింగిల్ సైడెడ్ సింగార్మ్ ఇంకా ఇంజిన్ కౌల్ వంటివి ఉన్నాయి.దీని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 4.3 ఇంచెస్ కలర్ టిఎఫ్‌టి క్లస్టర్ ఉంటుంది. ఇందులో స్ట్రీట్‌ఫైటర్ V2 డుకాటి మల్టీమీడియా సిస్టమ్ (DMS) కూడా అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇప్పుడు రైడర్ ఇన్‌కమింగ్ కాల్‌లను స్వీకరించవచ్చు, అదే సమయంలో బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా SMS నోటిఫికేషన్‌లను కూడా పొందవచ్చు.


కొత్త 2022 డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ V2 బైక్ అదే 955 సిసి సూపర్‌క్వాడ్రో ట్విన్-సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 153 బిహెచ్‌పి పవర్ ఇంకా 9000 ఆర్‌పిఎమ్ వద్ద 101.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో హై,మిడ్ ఇంకా లో అనే మూడు పవర్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది దాని పానిగేల్ V2 కంటే కూడా తక్కువ పవర్ అందిస్తుంది.ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ షోవా షార్క్ ఇంకా వెనుకవైపు ఫుల్లీ అడ్జస్టబుల్ సాక్స్ షాక్ అబ్జార్బర్ ఉంది.ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయెల్ 320 మిమీ డిస్క్ ఇంకా వెనుక భాగంలో డ్యూయెల్ పిస్టన్ కాలిపర్లతో 245 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అంతే కాకుండా పిరెల్లి డియాబ్లో రోసో IV 120/70 సెక్షన్ ఫ్రంట్ ఇంకా 180/60 సెక్షన్ రియర్ టైర్లను కలిగి ఉంటుంది. రైడింగ్ సమయంలో మంచి గ్రిప్ అనిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: