చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా ప్ర‌పంచాన్ని చుట్టేసిన‌ క‌రోనా వైర‌స్ పుట్టుక‌ గురించి ఫ్రెంచ్ వైరాల‌జిస్ట్‌, మెడిసిన్ నోబెల్ గ్ర‌హీత మెంటాగ్నియ‌ర్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్‌ను ప్ర‌కృతి సృష్టించ‌లేద‌ని, అది మానవ సృష్టేన‌ని, అది కూడా వుహాన్ కేంద్రంగానే జ‌రిగింద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఓ ఫ్రెంచ్ న్యూస్‌ చానెల్‌కు ఆయ‌న ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ జ‌న్యువులో ఎయిడ్స్‌, మ‌లేరియా సూక్ష్మ‌క్రిమి ల‌క్ష‌ణాలు అనుమానాస్ప‌దంగా ఉన్నాయని, ఇవి స‌హ‌జంగా త‌లెత్తేవి కాద‌ని ఆయ‌న తెలిపారు. వుహాన్‌లోని ల్యాబ్‌లో ఎయిడ్స్ వ్యాధికి వ్యాక్సిన్‌ క‌నిపెట్టే క్ర‌మంలో ఇది జ‌నించింద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. చైనాలోని వుహాన్ నేష‌న‌ల్ బ‌యోసేఫ్టీ ల్యాబొరేట‌రీలో జ‌రిగి ప్ర‌మాదం  జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు.

 

2000 సంవ‌త్స‌రం నుంచి ఈ వైర‌స్‌లో కొత్త ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మెంటాగ్నియ‌ర్ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించ‌గానే.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి చైనాపై అనుమానాలు వ్య‌క్తం చేశారు. క‌రోనా వైర‌స్ పుట్టుక గురించి కొత్త‌కొత్త విష‌యాల‌ను వింటున్నామ‌ని, దీనిపై పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు చేస్తామ‌ని పేర్కొన్నారు. అలాగే.. ఆ దేశ విదేశాంగ కార్య‌ద‌ర్శి మైక్ పాంపీ మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ ఎలా పుట్టిందో.. ఎలా ప్ర‌పంచాన్ని నాశనం చేసిందో.. దీనికి ఎవ‌రు కార‌ణ‌మో.. అంతా తెలుసున‌ని ఆరోపించారు. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌దార్థాలు ఉన్నాయ‌ని తెలుసున‌ని పేర్కొన్నారు. దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: