చైనా రాజధాని బీజింగ్ లో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. అక్కడ కరోనా కట్టడి అయింది అని భావించినా సరే భారీగా రోజు రోజుకి కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. బీజింగ్‌లో కొత్త‌గా 22 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని అక్కడి సర్కార్ పేర్కొంది.

 

వీటితోపాటు, మూడు అనుమానిత కేసులు, రోగ ల‌క్ష‌ణాలు క‌లిగిన వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు చైనాలో కరోనా కేసులు 83 వేల 352 గుర్తించారు. మొత్తం అక్కడ 4,634 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. బీజింగ్ నగరం లో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. మరి కొన్ని రోజులు లాక్ డౌన్ ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: