రాయలసీమ జిల్లాల్లో ఈ మధ్య కాలంలో నాటు బాంబుల వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అయింది. ప్రతీ జిల్లాలో ఎక్కడో ఒక చోట నాటు బాంబులు ఈ నాలుగు జిల్లాల్లో బయటపడుతూ వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో బాంబుల వ్యవహారం దుమారం రేపింది. వెదురుకుప్పం మండలం లో నాటు బాంబులు ప్రజలను కంగారు పెట్టాయి. నాటు బాంబులు సంచిలో వేసుకుని తీసుకు వెళుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

నాటు బాంబుల పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అడవి జంతువుల వేట కోసం నాటు బాంబులు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయితీ మహేశ్వరం ఎస్ టి కాలనీ కి చెందిన దొరస్వామి(37)ని అరెస్టు చేసారు. మరో ఇద్దరు పరార్ అయ్యారని వారి కోసం గాలిస్తున్నారని తెలిసింది. తిరుపతి -కొత్తపల్లిమిట్ట రోడ్డు గొడుగు చింత వద్ద 20 నాటు బాంబులను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: