కుల గణనపై ముఖ్యమంత్రికి జనసేన అధినేత పవన్ ప్రశ్నలు సంధిస్తూ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కులగణన ఉద్దేశం ఎన్నికల ముందే ఎందుకు వచ్చిందన్న పవన్‌ కల్యాణ్‌.. కులగణనకు కారణాలు వివరిస్తూ ప్రభుత్వం ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇది ఆర్టికల్ 21 ప్రకారం వచ్చిన వ్యక్తిగత గోప్యత, భద్రత, స్వేచ్ఛ హరించటం కాదా అని పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు.


బీహార్ ప్రభుత్వం చేసిన కులగణన సుప్రింకోర్టులో ఉందని.. ఆ తీర్పు రాకముందే కులగణన పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేయటం కాదా అని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. సంక్లిష్టమైన జనగణన ప్రక్రియను నిపుణులతో కాకుండా ఎలాంటి అర్హతలు ఉన్నాయని వాలంటీర్లతో చేయించాలని చూస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ అడిగారు. గతంలో కేంబ్రిడ్జ్ అనలిటిక ఇలాంటి డేటా సేకరించినప్పుడు సమాజంలో అశాంతి చెలరేగిందని.. ఎన్నికల కోసం, స్వీయ ప్రయోజనాల కోసం మీరు వాడుకున్నారనే విషయం మాకు తెలియదా అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: