
కానీ అస్థిర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు.. స్పష్టమైన మెజార్టీ లేనప్పుడు.. ఇతర పార్టీలపై ఆధారపడినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఒకరికి నచ్చిన బిల్లు మరొకరికి నచ్చదు. ఉదాహరణకు దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆప్ తీసుకువచ్చిన బిల్లును బీజేపీ సహా, ప్రభుత్వ భాగస్వామి అయిన కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. బిల్లు పాస్ అవ్వలేదు. దీంతో వెంటనే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు.
సంకీర్ణ ప్రభుత్వాల శకంలో భారతదేశ అభివృద్ధి వెనక్కి పోతుంది అని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. నరేంద్ర మోదీ కూడా సంకీర్ణ ప్రభుత్వాన్నే నడిపిస్తున్నారు. కానీ తాను అనుకున్న బిల్లులను ఆమోదింపజేసుకుంటున్నారు. ఎలా సాధ్యమైంది అంటే బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి బిల్లులు ఎలా అయినా పాస్ అవుతాయి. ఆ ఉద్దేశంతో అయినా మిత్ర పక్ష పార్టీలు వారికి మద్దతు తెలుపుతాయి.
మహిళా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటం వల్లే దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు సాధ్యమైంది. సుస్థిర ప్రభుత్వాలు లేనట్లయితే దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి స్వప్రయోజనాల కోసం పనిచేస్తుంటారు అని విపక్షాలను ఉద్దేశించి అన్నారు. ఇదే నరేంద్ర మోదీ పరోక్షంగా ఇచ్చిన సందేశం.