ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ పుట్టుకొస్తుందో తెలియదు.  2009 ఎన్నికల సమయంలో అధికారం కోసం టీడీపీ, కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్న సమయంలో అనూహ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అంతేకాకుండా దాదాపు 18 శాతం ఓట్లు పొంది 18 శాసన సభ స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్ మరణాంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత అక్కడ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.  


మళ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు పవన్ కల్యాణ్ 2014లో జనసేన స్థాపించారు. కానీ 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు. 2019లో పోటీచేసి 6 శాతం ఓట్లు సాధించారు.  ఇప్పుడు పవన్ కల్యాణ్ కు మంచి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు, జగన్ లు ఒకరిపై మరొకరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తరుణంలో ఇద్దరూ అవినీతిపరులే అని పవన్ ప్రచారం చేసుకుంటే ఏపీ ప్రజలకు ప్రత్యామ్నాయం అయ్యేవాడు. కానీ పవన్ టీడీపీతో కలిసి ముందుకు వెళ్తాం అని ప్రకటించారు.


చంద్రబాబు అరెస్టు, లోకేశ్ సంక్షోభంలో ఉండగా అన్నలా అండగా నిలబడ్డాడు పవన్ కల్యాణ్.  ఈ సందర్భంలో అదనపు లబ్ధి పవన్ కు చేకూరుతుందా. అధికార పంపిణీలో భాగంగా తొలి రెండున్నరేళ్లు పవన్ కు సీఎంగా టీడీపీ అవకాశం ఇస్తుందా అనేది చూడాలి. అలా నిర్ణయిస్తే దాదాపు 95 శాతం కాపు సామాజిక వర్గం తో పాటు తటస్థులు కూడా టీడీపీ వైపు మొగ్గే అవకాశం ఉంది. లేని పక్షంలో 30-40 శాతం ఓట్లు మళ్లే అవకాశం ఉంది. ఈ సంక్షోభ సమయంలో అండగా ఉన్న పవన్ కల్యాణ్ పై సానుకూల ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నారు. కానీ ఎల్లో మీడియా మాత్రం పవన్ పై అనుమాన  ధృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తుంది.  ఇలాంటి సందర్భంలో పవన్ కు టీడీపీ లీడ్ రోల్ ఇస్తుందా.. వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: