కెనడాలో కన్జర్వేటివ్, అండ్ లిబరల్ అనే రెండు జాతీయ పార్టీలు ప్రధానమైనవి. ప్రస్తుతం కెనడా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకి చెందిన వ్యక్తి. అయితే కెనడా పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో వీరికి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో నేషనల్ న్యూ డెమొక్రటిక్ పార్టీకి చెందిన 24 మంది ఎంపీల మద్దతుతో కెనడాలో ప్రభుత్వాన్ని ట్రూడో ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీలో మొత్తం సిక్కులే ఎక్కువగా ఉంటారు.


సిక్కు ప్రాంతాలకు చెందిన వారు ఉండడంతోనే కెనడా ప్రధాని భారత్ పై వ్యతిరేక నిర్ణయం తీసుకున్నట్లు అర్థం అవుతోంది. సిక్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్తాన్ అనుకూల వర్గం వారు కెనడాలో ఎక్కువగా ఉండటం వల్ల వారి ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో న్యూ డెమొక్రటిక్ చెప్పు చేతల్లో కెనడా ప్రధాని ట్రూడో ఉన్నాడని వారు చెప్పినట్లు వింటూ వారు ఏ విధంగా నడుచుకోవాలని చెబితే అదే విధంగా నడుచుకుంటున్నట్లు అర్థం అవుతోంది.


భారత్ లోకి ఖలిస్తాన్ తీవ్రవాదులు వచ్చి ఎర్రకోట మీద జెండా ఎగరేయాలని ప్రయత్నం చేసినా.. పంజాబ్ లో అల్లర్లు సృష్టించాలని చూసినా దీని వెనక కెనడాలోని ఖలిస్తాన్ అనుకూల మద్దతు దారుల హస్తం ఉందనే విషయం తెలిసిపోయింది. అందుకే భారత ప్రభుత్వం కెనడాలో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాదుల లిస్టును పంపి వారిని భారత్ కు అప్పగించాల్సిందిగా కోరింది.


అయితే దీనికి నిరాకరించిన కెనడా తిరిగి భారత ఎజెంట్లే హర్ దీప్ సింగ్ నిజ్జర్ అనే కెనడా జాతీయుడిని చంపేశారని ఆరోపణలు చేశారు. అయితే రెండేళ్ల తర్వాత కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు జరగబోయే ఎన్నికల్లో ట్రూడో విజయం సాధించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కన్జర్వేటివ్ పార్టీకి బలం చేకూరేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి ఇప్పటికే 40 శాతం మంది ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: