ప్రస్తుత  కాలంలో ఎక్కువమంది చిన్నపిల్లలు ఎస్.ఎస్.సి లేదా ఇంటర్ చదువు పూర్తి కాగానే పై చదవులకని పట్టణాలకు నగరాలకు వెళ్ళడము  పరిపాటి అయిన విషయము. మగపిల్లలు ఒక్కసారిగా దొరికిన ఆ స్వేచ్ఛతో సిగరెట్లకు అలవాటు కావడం కూడా చాలా సాధారణమైన విషయముగా మారిపోయింది.. అలాగే బాగా ఒత్తిడితో ఉండే ఉద్యోగాలూ, కాన్ఫరెన్సులు, మీటింగుల తర్వాత రిలాక్స్‌ కావడం కోసం పొగతాగడం చాలా మందిలో అలా మెల్ల మెల్లగా అలవాటైపోతుంది. ఇలాంటి వ్యవహారాలు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు కాస్త ఎక్కువ అని బాగా తెలుస్తుంది.

 

Image result for cancer

 

ఇక  అబ్బాయిలకు సరదాగా పొద్దు పోవడానికి, టైమ్‌ పాస్‌ కోసం మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్‌ వంటి దురలవాట్లు, వాటితోపాటు బయటి తిండి ఎక్కువగా అలవాటు పడుతుంటారు. ఇలా  బయటి ఆహారం రుచికరంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం నూనెలు, ఉప్పుకారాలూ ఎక్కువగా ఉపయోగిస్తారు. దేహానికి, ఆరోగ్యానికి హాని చేసే కొన్ని కృత్రిమరంగులు, రసాయనాలు  కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక  వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడటమూ జరుగుతుంది. ఇవన్నీ క్యాన్సర్‌కు ముఖ్య కారణాలయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అని నిపుణులు తెలుపుతున్నారు.

 

Image result for cancer
   

ప్రస్తుతానికి  ప్రపంచంవ్యాప్తంగా క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకి   బాగా  పెరుగుతున్న ధోరణులను చూస్తే 2007 నుంచి 2030 నాటికి ఈ సంఖ్య ఇప్పటికంటే 45% ఎక్కువయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.  అవగాహన పెంచే కార్యక్రమాలు, జాగ్రత్తలు, ముందుగానే పసిగట్టే స్క్రీనింగ్‌ పరీక్షలు ఎన్ని వచ్చినా క్యాన్సర్‌ రాకుండా నివారించగలగడం ఎవరి చేతుల్లోనూ లేదు అనేది సత్యం. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధ్యయనాల ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తో కూడిన మరణాల సంఖ్య... అన్ని మరణాల సంఖ్య కంటే  ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది.

 

Image result for cancer

 

వీలయినంత వరకు జింక్ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు అని ఎన్నో అడ్వర్టైజ్మెంట్ మెంట్ ద్వారా చూపిస్తున్న ను చాలా మందికి అర్థం కావడం లేదు నిజానికి. జంక్ ఫుడ్ తో ఊబకాయం, క్యాన్సర్‌ ముప్పులు పొంచి ఉంటాయి. అనడంలో ఏ మాత్రం సందేహం లేదు అని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: