రాజకీయాల్లో కష్టంతో పాటు కాస్త అదృష్టం ఉంటే నాయకులకు సక్సెస్ వస్తుందనే చెప్పాలి. అయితే ఎంత కష్టపడిన కొందరికి అదృష్టం లేక సక్సెస్ కాలేరు. కానీ కష్టంతో పాటు చిన్న చిన్న అదృష్టాలతో సక్సెస్ చూస్తున్న వారిలో కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఉంటారనే చెప్పొచ్చు. ఇక ఆయనకు అపోజిట్‌లో అదృష్టం లేని నాయకుడు వచ్చి బండారు సత్యానందరావు ఉన్నారు.

ఎందుకంటే 2004 ఎన్నికల నుంచి జగ్గిరెడ్డికి అదృష్టం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. 2004లో కాంగ్రెస్ తరుపున బరిలో దిగిన జగ్గిరెడ్డి....టి‌డి‌పి నేత బండారుపై కేవలం 2 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో అదే 2 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల తేడాతో జగ్గిరెడ్డి మరొకసారి బండారుపై గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ గాలి ఉన్నా సరే కేవలం 4 వేల ఓట్ల మెజారిటీతో మరొకసారి జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.


అంటే మూడుసార్లు చిన్న చిన్న మెజారిటీలతో జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచేశారు. ఇక తక్కువ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గిరెడ్డి...కొత్తపేటలో బాగానే పనిచేసుకుంటున్నారు...ప్రజలకు అందుబాటులో ఉండటం....అండగా ఉండటం...సమయానికి సంక్షేమ పథకాలు అందేలా చేయడం....ప్రభుత్వం తరుపున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి మంచి విజయాలు అందేలా చేశారు. ఇక కొత్తపేటలో సమస్యలు బాగానే ఉన్నాయి...రోడ్లని అభివృద్ధి చేయాలి..తాగునీటి సమస్యలు ఉన్నాయి.

రాజకీయంగా వస్తే జగ్గిరెడ్డి బలం బాగానే ఉంది...అదే సమయంలో టి‌డి‌పి కూడా పుంజుకుంటుంది. ఈ సారి జగ్గిరెడ్డికి ఛాన్స్ ఇవ్వకూడదని బండారు భావిస్తున్నారు. అటు జనసేనకు ఇక్కడ పట్టు ఉంది. ఒకవేళ టి‌డి‌పి-జనసేనలు కలిసి పనిచేస్తే జగ్గిరెడ్డికి అదృష్టం దక్కదు. మూడుసార్లు లక్కీగా గెలిచేశారు. కానీ టి‌డి‌పి-జనసేనలు కలిస్తే మాత్రం...గెలుపు ఈజీ కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కొత్తపేటలో జనసేనకు 35 వేల ఓట్లు వచ్చాయి. అంటే ఆ రెండు పార్టీలు కలిస్తే జగ్గిరెడ్డి పొజిషన్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: